క్రిషా అంబానీ బర్త్‌డేకి అత్తగారి ప్రశంసలు: వైరల్‌ వీడియో, ఎవరీ క్రిషా!

Ambani son Jai Anmol Ambani celebrates wife Khrisha Ambani birthday video goes viral - Sakshi

సాక్షి,ముంబై: అంబానీ ఫ్యామిలీకి సంబంధించి సోషల్‌మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ, నటి టీనా అంబానీ దంపతుల  కుమారుడు  జై అన్మోల్ అంబానీ తన భార్య క్రిషా అంబానీ పుట్టిన రోజును (మే 5న) వీడియోలో ఇపుడు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ వీడియోలో జై అన్మోల్ అంబానీ పక్కనే నిలబడి భార్యతో కేక్ కట్ చేయించడాన్ని చూడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు ఈ స్టైలిష్‌ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

అటు క్రిషా కూడా తన స్టైలిష్‌ ఔట్‌ఫిట్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. బెల్ స్లీవ్స్‌, ప్రింటెడ్ మస్టర్డ్-హ్యూడ్ మ్యాక్సీ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది. ఈ కపుల్‌ కేక్ కటింగ్ వేడుక ఆసక్తికరంగా మారింది. మరోవైపు క్రిషా అంబానీ  పుట్టిన రోజు  సందర్భంగా, క్రిషా అంబానీ అత్తగారు టీనా అంబానీ  ఇన్‌స్టా ద్వారా  కోడలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ క్రిషా.. నువ్వు మాతో ఉండటం  చాలా గర్వంగా ఉంది’’ అంటూ కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. (తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!)

తెలివైన  అమ్మాయి.  ఇన్నోవేషన్‌లకు, ఐడియాల పుట్ట. ఇంటికి శక్తి, యుక్తి వెలుగు.. అన్నింటికి మించి లవింగ్‌ డాటర్‌ టీనా కోడలిపై ప్రశంసలు కురిపించారు.  కాగా  జై అన్మోల్ అంబానీ, క్రిషా గత ఏడాది ఫిబ్రవరి 20న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచు సోషల్‌ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది.  (బీమా పాలసీపై క్రెడిట్‌ కార్డ్‌ లోన్స్‌: ఇకపై ఇలా చేయలేరు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top