200 ఈవీ చార్జింగ్‌ పాయింట్ల సూపర్‌ హబ్‌.. ఎక్కడ? | Adani TotalEnergies E-Mobility partners with Evera Cabs to develop charging hubs - Sakshi
Sakshi News home page

200 ఈవీ చార్జింగ్‌ పాయింట్ల సూపర్‌ హబ్‌.. ఎక్కడ?

Aug 23 2023 8:28 AM | Updated on Aug 23 2023 1:43 PM

Adani Total Energies E Mobility Evera Cabs to develop charging hubs - Sakshi

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాలకు చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా ఎలక్ట్రిక్‌ క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థ ప్రకృతి ఈ–మొబిలిటీ (ఎవెరా)తో చేతులు కలిపినట్లు అదానీ టోటల్‌ఎనర్జీస్‌ ఈ–మొబిలిటీ (ఏటీఈఎల్‌) తెలిపింది. దీనితో ఢిల్లీలో 200 ఈవీ చార్జింగ్‌ పాయింట్ల సూపర్‌ హబ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది.

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దేశవ్యాప్తంగా కూడా విస్తరించనున్నట్లు ఏటీఈఎల్‌ వివరించింది. అదానీ టోటల్ ఎనర్జీస్ ఈ-మొబిలిటీ లిమిటెడ్ అనేది అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్‌కు చెందిన విభాగం. ఇది భారతదేశంలో ఛార్జ్ పాయింట్లను నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement