బ్యాంకుల్లో బంపర్‌ ఆఫర్లు, లోన్ల కోసం అప్లయ్‌ చేస్తున్నారా?

5 Things To Check Before Applying For Personal Loan And ​home Loan - Sakshi

ఈ ఏడాది పండుగల కాలంలో (దీపావళి వరకు కొనసాగే సీజన్‌) ఇళ్లకు డిమాండ్‌ బలంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వ- ప్రైవేట్‌ రంగానికి చెందిన బ్యాంకులు హోంలోన్‌లపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. దీంతో కొనుగోలు దారులు బ్యాంకులు ఇచ్చే లోన్ల సాయంతో తమ కలల సౌధాన్ని నిర్మించుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల్లో  హోం లోన్‌, పర్సనల్‌ లోన్‌ కోసం అప్లయ్‌ చేసేముందు కొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని, తద్వారా భవిష్యత్‌లో ఎలాంటి ఆర్దిక సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. 

అప్పులు,క్రెడిట్ కార్డును క్లియర్ చేయడం 
బ్యాంకులో లోన్ల కోసం అప్లయ్‌ చేసే ముందు ఉన్న అప్పులు, క్రెడిట్‌ కార్డ్‌ బిల్స్‌ను పూర్తిగా చెల్లించడం మంచిదని అర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇక మీ ఆదాయాన్ని బట్టి బ్యాంకులు రుణాల్ని ఇవ్వడమో,లేదంటే ఆదాయం తక్కువగా ఉందని లోన్‌ రిజెక్ట్‌ చేస్తాయని క్లిక్‌ క్యాపిటల్‌ సంస్థ తెలిపింది. ఒకవేళ రుణం మంజూరైనా కట్టలేని పరిస్థితులు తలెత్తితే ఇబ్బందులు పడే అవకాశం ఉందని సూచించింది. సాధారణంగా, మీరు ప్రస్తుతం చెల్లించే మొత్తం ఈఎంఐలు, నెలవారీ ఆదాయంలో 30 లేదా 40శాతం మించకూడదు. లేదంటే లోన్ కోసం అప్లై చేసే ముందు.. మీకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తిన మీరు తీసుకున్న రుణాన్ని చెల్లించే ఆరు నెలలు,సంవత్సరం మొత్తాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. 

క్రెడిట్ స్కోర్
క్రెడిట్ కార్డ్‌ స్కోర్ చాలా కీలకం. ఎందుకంటే పర్సనల్‌ లోన్‌, హోం లోన్‌ ఇవ్వాలన్నా బ్యాంకులు మీ క్రెడిట్‌ కార్డ్‌ స్కోర్‌ను బట్టి మీ ఆర్ధిక స్థోమతను అంచనా వేస్తాయి. క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే మీకు కావాల్సిన లోన్లను వెంటనే ఇచ్చేస్తాయి. సాధారణంగా  725 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే మీరు తీసుకున్న రుణాల్ని సరైన సమయానికే చెల్లిస్తున్నారని అర్ధం. 725 లోపు క్రెడిట్‌ కార్డ్‌ స్కోర్‌ ఉంటే మీరు తీసుకున్న మొత్తాన్ని చెల్లించడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి. అదే సమయంలో మీ లోన్‌లను రిజెక్ట్‌ చేస్తాయి. ఒకవేళ ఆన్‌లైన్‌ ద్వారా లోన్‌ అప్లయ్‌ చేయాలని చూస్తే బ్యాంకులు  అధిక మొత్తంలో వడ్డీని విధిస్తాయి.

అన్ని ఆదాయ వనరులను చేర్చండి
బ్యాంక్‌లోన్‌ కోసం ప్రయత్నిస్తుంటే మీ శాలరీ ఎంత వస్తుంది. మీ పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేయడం వల్ల ఎంత సంపాదిస్తున్నారు. ఒకవేళ మీ సొంతిల్లును అద్దెకిస్తే .. నెలవారీ రెంట్‌ ఎంత వస్తుంది. అనే అంశాలపై బ్యాంకు అధికారులకు స్పష్టత ఇవ్వాలి. 

లోన్‌ కోసం ఎక్కువ సార్లు అప్లయ్‌ చేయొద్దు 
మీరు అప్లయ్‌ చేసిన ప్రతి సారి లోన్‌ రిజెక్ట్‌ అయ్యిందని మరోసారి ప్రయత్నిస్తారేమో? అలా చేయడం వల్ల బ్యాంకులు మీలోన్లను రిజెక్ట్‌ చేసే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. లోన్‌ అప్లయ్‌ చేసిన సమయంలో క్రెడిట్‌ బ్యూరో అధికారులు అన్నీ రకాలుగా విచారణ చేపడతారు. మీకు ఆర్ధిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తారు. అంతేకాదు క్రెడిట్‌ స్కోర్‌ తగ్గడం, బ్యాంక్‌ లోన్లను రిజెక్ట్‌ చేయడం జరుగుతుంది.  

అర్హత ఉందో లేదో చెక్‌ చేసుకోండి
బ్యాంక్‌ లోన్‌ పెద్ద మొత్తంలో అప్లయ్‌ చేయొద్దు. అలా చేయడం వల్ల భవిష్యత్‌లో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లోన్‌ అప్లయ్‌ చేసే ముందుకు తీసుకున్న రుణాన్ని చెల్లించగలిగే సామర్ధ్యం ఉందా? లేదా? అనే విషయాల్ని గుర్తుంచుకోవాలి.  

చదవండి: హోం లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు, ఇళ్లకు డిమాండ్‌

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top