పాఠశాల అభివృద్ధిలో హెచ్‌ఎంలు కీలకం | - | Sakshi
Sakshi News home page

పాఠశాల అభివృద్ధిలో హెచ్‌ఎంలు కీలకం

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

కొత్తగూడెంఅర్బన్‌: పాఠశాల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా విద్యాధికారి బి.వాసంతి తెలిపారు. ప్రధానోపాధ్యాయుల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కొత్తగూడెంలోని విద్యా శిక్షణా కేంద్రంలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఎల్‌ఐపీ, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. రోజూ కనీసం ఇద్దరు ఉపాధ్యాయుల బోధనను పరిశీలించి, లోటుపాట్లపై సూచనలు ఇవ్వాలన్నారు. అనంతరం ఫిజికల్‌ డైరెక్టర్ల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాధవరావు, ఎస్‌కే సైదులు, జుంకీలాల్‌, బాలాజీ, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

జిల్లా విద్యాధికారి వాసంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement