భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డలో బుధవారం ఉదయం జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టగా.. ఐదు ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండగా ఆపి విచారించారు. వాటిలో రెండు ఖాళీ ట్రాక్టర్లను పక్కనే ఉన్న జామాయిల్ తోటలో వదిలిపెట్టి డ్రైవర్లు పారిపోతుండగా, వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పట్టుబడిన ట్రాక్టర్లను, డ్రైవర్లను స్థానిక పోలీస్‌స్టేషన్‌కి తరలించి పోలీసులకు అప్పగించారు. టౌన్ పోలీసులు ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి ట్రాక్టర్ డ్రైవర్లతో పాటు ఓనర్లపై కేసు నమోదు చేశారు.


