సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

చుంచుపల్లి: జిల్లాలో సీజనల్‌ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ తుకారంరాథోడ్‌ వైద్యాధికారులకు సూచించారు. బుధవారం ఆయన జూమ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, టీచింగ్‌ ఆస్పత్రులు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచాలని, వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా నోటీస్‌ బోర్డుపై ప్రదర్శించాల న్నారు. వైద్యాధికారులు తమ పరిధిలో ఉన్న ప్రభు త్వ, ప్రైవేట్‌ హాస్టళ్లను రెండు వారాలకి ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేసి విద్యార్థులకు వైద్య శిబిరా లు నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేయాలని, హాస్టల్‌ సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి జ్వరం, విరేచనాలు, వాంతులు, దగ్గు, జలుబు తదితర లక్షణా లు ఉన్న వ్యక్తులను గుర్తించి వెంటనే సంబంధిత వైద్యాధికారికి సమా చారం అందించాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి చికిత్స అందించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement