ఖమ్మంక్రైం: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో నియామకానికి పచ్చజెండా ఊపింది. ఈక్రమాన ఒకేసారి భారీగా పోలీసు ఉద్యోగాల నియామకానికి బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 621 ఉద్యోగాలను కేటాయించారు.
విభాగాల వారీగా...
రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఖమ్మం జిల్లాకు సివిల్ కానిస్టేబుల్ 309, ఏఆర్ కానిస్టేబుళ్లు 23, అగ్నిమాపక శాఖలో 18 కానిస్టేబుల్ పోస్టులు కేటాయించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సివిల్ 139, ఏఆర్ 32 అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ పోస్టులు 25 కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇవికాక ఉమ్మడి జైళ్ల శాఖకు 75 పోస్టులతో పాటు స్పెషల్ పార్టీ, బెటాలియన్లకు సైతం పోస్టులు కేటాయించినట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.


