సత్వర విచారణతోనే కేసుల్లో పురోగతి | - | Sakshi
Sakshi News home page

సత్వర విచారణతోనే కేసుల్లో పురోగతి

Jul 29 2026 12:40 AM | Updated on Jul 29 2026 12:40 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): సైబర్‌ నేరాలు, సెల్‌ఫోన్ల చోరీ కేసుల్లో సత్వర విచారణతోనే ఫలితం ఉంటుందని ఎస్పీ రోహిత్‌రాజ్‌ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఐటీ కోర్‌, సైబర్‌ సెల్‌ విభాగాలను మంగళవారం ఆయన పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరు, పెండింగ్‌ కేసులు, సాంకేతిక సమస్యలు, డేటా నమోదుపై ఆరా తీశాక ఎస్పీ మాట్లాడారు. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నవారు సీఈఐఆర్‌ పోర్టల్‌లో నమోదు చేశాక బ్లాక్‌ చేయడం, రికవరీ ప్రక్రియలో మరింత వేగం పెంచాలని తెలిపారు. అంతేకాక సైబర్‌ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఫిర్యాదులపై తక్షణ స్పందన ద్వారా బాధితుల డబ్బు రికవరీ చేయొచ్చని చెప్పారు. ఇందుకోసం సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే, డిజిటల్‌ అరెస్ట్‌, సైబర్‌ మోసాల బారిన పడకుండా ప్రజలకు విస్తృ త అవగాహన కల్పించాలని తెలిపారు. ఇదేసమయాన అన్ని విభాగాల ఉద్యోగులు డేటా భద్రత, అధికారిక సమాచారం గోప్యత, సైబర్‌ భద్రతా నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేయాని ఎస్పీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సైబర్‌ సెల్‌ సీఐ జితేందర్‌, ఐటీ కోర్‌ ఎస్సై గణేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement