పాల్వంచరూరల్: ఎల్‌నినో కారణంగా వర్షాభా వ పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరికి బదులు ప్రత్నామ్నాయ పంటలు సాగు చేయా లని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూ రావు సూచించారు. పాల్వంచ మండలం జగన్నాథపురం రైతువేదికలో మంగళవారం జరిగిన విత్తనమేళాలో ఆయన రైతులకు ఆరుతడి పంటల విత్తనాలను అందజేసి మాట్లాడారు. కందులు, మినుములు, పెసర, జొన్న, సజ్జ, ఆముదం విత్తనాలు అందుబాటులో ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఏఓ పి.శంకర్, హెచ్‌ఈఓ శంకర్ రావు, ఏఈఓలు విశాల, పవన్, నరేశ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఏఎస్‌ఎస్‌ఏ
కార్యవర్గం ఎన్నిక
అశ్వాపురం: మండలంలోని మణుగూరు భారజల కర్మాగారం సైంటిఫిక్ అసిస్టెంట్ల సూపర్‌వైజర్ స్టాఫ్ అసోసియేషన్ (ఎస్‌ఏఎస్‌ఎస్‌ఏ) కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నెల 25 తో నామినేషన్ల స్వీకరణ, 27న ఉపసంహరణ గడువు ముగిసింది. ఆఫీస్ బేరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవులకు ఒక్కో నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోహన్‌బాబు, రన్ను హుస్సేన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎ.శ్రీనివాసులు, ఎం.నాగేంద్రకుమార్, సంయుక్త కార్యదర్శిగా డి.నవీన్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంకట ప్రసాద్, వెల్ఫేర్ సెక్రటరీగా ఎం.పాండు, ఆఫీస్ సెక్రటరీగా బీ.ఎం.వీ.నాగవేంద్రరావు, కోశాధికారిగా జయశంకర్ ఎన్నికయ్యారు. అలాగే, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్.డీ.జైసన్, సీహెచ్‌వీ.రమణ, జి.దిలీప్‌కుమార్, సముద్రాల శ్రీనివాస్ ఎన్నికయ్యా రని ఎన్నికల అధికారి అనిల్‌కుమార్ వెల్లడించారు. ఏకగ్రీవానికి సహకరించిన అన్ని యూని యన్ల నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన కార్యవర్గ బాధ్యులు.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
అధిక ధరలకు
గ్యాస్ సిలిండర్ల విక్రయం
87 సిలిండర్లు స్వాధీనం చేసుకున్న
అధికారులు
కామేపల్లి: నిబంధనలు ఉల్లంఘించి గ్యాస్ సిలిండర్లను అధికధరలకు విక్రయిస్తున్నట్లు సివి ల్ సప్లయీస్ అధికారులు మంగళవారం చేపట్టిన తనిఖీల్లోగుర్తించారు. మండలంలోని పాత లింగాలలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మల్లి కార్జున్‌రావు నేతృత్వాన తనిఖీ చేయగా ఒక్కో సిలిండర్‌పై రూ.100 అదనంగా వసూ లు చేస్తున్నట్లు తేలింది. ఈ మేరకు భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన శ్రీ లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ కి సంబంధించి 52, తేజస్విని గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి 35 సిలిండర్లను సీజ్ చేసి కామేపల్లి సాయి తిరుమల గ్యాస్ ఏజెన్సీ గోదాంలో నిల్వ చేసినట్లు వెల్లడించారు. అంతేకాక ఏజెన్సీలపై చర్యల నిమిత్తం భద్రాద్రి అదనపు కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు డీఎస్‌ఓ తెలిపారు.
ప్రధానితో ముఖాముఖిలో ఎస్‌బీఐటీ విద్యార్థులు
ఖమ్మంసహకారనగర్: వికసిత్ భారత్–2047లో భాగంగా ప్రధానమంత్రి మోదీ మై భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు ఖమ్మంలోని ఎస్‌బీఐటీ విద్యార్థులు 10 మందికి ప్రధా ని మోదీతో మాట్లాడే అవకాశం దక్కిందని కళా శాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. ప్రధాని మోదీతో సంభాషించే అరుదైన అవకాశం తమ విద్యార్థులకు దక్కగా, దేశ నిర్మాణంలో యువ త పాత్ర, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలు, దేశాభివృద్ధి దిశగా ఆలోచనలను పంచుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులను కలెక్టర్ దివాకర టీ.ఎస్., కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ జి. ధాత్రి, వైస్ చైర్మన్ కె.శ్రీచైతన్య, అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్‌కుమార్, గంధం శ్రీనివాసరావు, ఏ.వీ.వీ.శివప్రసాద్, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ అభినందించారు.


