హరిహర క్షేత్రంలో అక్రమాలు! | - | Sakshi
Sakshi News home page

హరిహర క్షేత్రంలో అక్రమాలు!

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

ఇల్లెందు: పట్టణంలోని శ్రీ హరిహర క్షేత్రంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆలయం దేవాదాయశాఖ పరిధిలో ఉండగా, బినామీగా పూజా, కొబ్బరి కాయల దుకాణం నడుపుకునే ఉద్యోగి పెత్తనం పెరిగిపోయిందని, పూజారులపై పెత్తనం చేస్తూ, వారి నివాస గదులను ఆక్రమించాడని ఆరోపణలు వస్తున్నాయి. విషయం ఇటీవల ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి వెళ్లగా.. ఆయన ఆలయ ఈఓ సూర్యప్రకాష్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఆ గదిని మాత్రం ఖాళీ చేయలేదు. కాగా కొబ్బరి కాయలు, పూజా సామగ్రి వేలం పాట ఆగస్టు 1న ఆలయంలో నిర్వహించనున్నట్లు ఈఓ బి.సూర్యప్రకాశరావు ఒక ప్రకటనలో తెలిపారు. బినామీ పేరుతో టెండర్‌ పొందిన ఉద్యోగి విషయంలో చర్యలపై ప్రశ్నించగా.. స్కేల్‌ పోస్టు కాదని, అందుకే వదిలేశామని తెలిపారు.

ఏఆర్‌ కానిస్టేబుళ్ల ఆర్థికసాయం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): టేకులపల్లి మండలం కుంటల గ్రామనివాసి తోలం నాగేశ్వరావు జిల్లా డిస్ట్రిక్ట్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. స్పందించిన 2007 బ్యాచ్‌ తోటి సిబ్బంది మృతుడి కుటుంబానికి రూ.1,49,000 ఆర్థికసాయం సోమవారం అందించారు. ఎం.చంద్ర శేఖర్‌, శ్యామ్‌, లక్ష్మణ్‌ స్వామి, వెంకటేశ్వర్లు, రామారావు, రమేష్‌, గోపాల్‌, శేఖర్‌, సూర్యాపేట జిల్లా నుండి కె నాగరాజు, టి మధు మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement