నీట్‌ రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నీట్‌ రద్దు చేయాలి

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): విద్యార్థుల భవిష్యత్‌ ను నాశనం చేస్తున్న నీట్‌ను తక్షణమే రద్దు చేయాల ని, వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే తిరిగి అప్పగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. నీట్‌ పరీక్ష పేపర్ల లీకేజీతో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ సెంటర్‌ నుంచి ఓల్డ్‌ డిపో వరకు ప్లకార్డులతో ర్యాలీ జరిపారు.ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ విద్యార్థుల ఉసురుతీసిన నీట్‌ కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. ఢిల్లీలో విద్యార్థులు, యువజనులు అసమాన పోరాట పటిమ ప్రదర్శించారని అన్నారు. మేయర్‌ మూడ్‌ గణేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌ పాషా, నాయకులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, కందుల భాస్కర్‌, వాసిరెడ్డి మురళి, ఎస్కే ఫహీమ్‌, నేరెళ్ల రమేష్‌, భూక్యా శ్రీనివాస్‌, ఎండి యూసుఫ్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు నివాళి

కొత్తగూడెంఅర్బన్‌: మృతి చెందిన విద్యార్థులకు పోస్టాఫీస్‌ సెంటర్‌లో అంబేద్కర్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దెల శివకుమార్‌ , అల్లి శంకర్‌ , గుండా రమేష్‌, పి సురేందర్‌, భూపతి అశోక్‌, మచ్చ పృథ్వీరాజ్‌, రాజేశ్వరరావు , సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కూనంనేని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement