భద్రాచలం: గిరిజనుల ప్రభుత్వ పథకాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్‌అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. పరి శీలించి సంబంధిత అధికారులకు అప్పగించా రు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ప్రభు త్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అధికా రులు కృషి చేయాలన్నారు. ఐటీడీఏకు వచ్చే గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ(జనరల్) డేవిడ్ రాజ్, ఇతర అధికారులు ఆనంద్ కుమార్, చందన, అరుణకుమారి, మధుకర్, సైదులు, సున్నం రాంబాబు, గన్యా నాయక్, నారా యణరావు, సమ్మయ్య, మణిధర్ పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
భద్రాచలంటౌన్: గిరిజన మహిళలు స్వశక్తితో చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో భద్రాచలం లంబాడీ కాలనీకి చెందిన ’ఓం శక్తి జాయింట్ లయబిలిటీ గ్రూప్’ మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సోమవారం సందర్శించారు. మహిళలు ఇప్పపువ్వుతో తయారు చేసిన లడ్డూ, బర్ఫీ, నూనెతో పాటు రాగి, జొన్న జావలు, పచ్చళ్లు వంటి పోషకాహార ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు. ప్రతీ వారం జరిగే గిరిజన దర్బార్‌లో ఈ ఉత్పత్తులను అధికారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ మధుకర్ పాల్గొన్నారు.
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్


