చర్ల: మండలంలోని కలివేరు, భద్రాచలం పట్టణంలో ఆదివారం ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేపట్టి.. 57 లీటర్ల నాటుసారా, ముగ్గురు వ్యక్తులు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని కలివేరు సీఆర్‌పీఎఫ్ క్యాంపు సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 40 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనం, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం పట్టణంలో నిర్వహించిన తనిఖీల్లో 17 లీటర్ల నాటుసారాతో పాటు ముగ్గురు వ్యక్తుల (ఇద్దరు మహిళలు)ను అదుపులోకి తీసుకుని, వీరిపై కేసు నమోదు చేశామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుళ్లు వీరబాబు, ప్రసన్నకుమార్, తిరుపతి, ఉపేందర్ పాల్గొన్నారు.


