టీబీజీకేఎస్‌లో చేరికలు | - | Sakshi
Sakshi News home page

టీబీజీకేఎస్‌లో చేరికలు

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

రుద్రంపూర్‌: కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్‌లైన్‌లో పనిచేస్తున్న ఓవర్‌ మెన్లు, ఐదుగురు కార్మికులు ఆదివారం బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేరారు. వీరికి రవిచంద్ర కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించి, మాట్లాడా రు. కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఓవర్‌మెన్లుగా ఉద్యోగాలు ఇచ్చారని, కారుణ్య నియమకాలు చేపట్టటంతో పాటు సింగరేణి కార్మికులకు అనేక సదుపాయాలు కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో కాపు కృష్ణ, గడప రాజ య్య, వసికర్ల కిరణ్‌, బోరింగ్‌ శంకర్‌, ఈశ్వర్‌, వెంకటేశ్‌, సూరజ్‌, అశోక్‌, రాము లు, అన్వర్‌, వల్లాల రాయలింగు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

ఖమ్మంస్పోర్ట్స్‌: హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా భీమనాథుల అశోక్‌రెడ్డి, వరికేటి మోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన ఎన్నికలకు పలు మండలాల బాధ్యు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోగా వివరాలను ఎన్నికల అధికారి అరుణ్‌కుమార్‌ ప్రకటించా రు. అధ్యక్ష, కార్యదర్శులుగా అశోక్‌రెడ్డి, మోహన్‌తో పాటు ఉపాధ్యక్షులుగా ఇందుర్తి బ్రహ్మానందరెడ్డి, కోడిశెల అనిల్‌, బందెల్ల భాస్కర్‌రావు, సంయుక్త కార్యదర్శులుగా ఇనుపనూరి రాంమాంజనేయులు, జెట్టి రామకృష్ణ, లింగాల బాలరాజు, సండ్ర నితిన్‌ ఎన్నికయ్యా రు. ఎన్నికలను రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ అసోసియేష న్‌ ప్రతినిధి కనపర్తి రమేశ్‌, అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎండీ గౌస్‌, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా కార్య దర్శి కె.క్రిస్టోఫర్‌బాబు పర్యవేక్షించారు.

‘వైబ్రంట్‌ విలేజ్‌’కు హాజరు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్‌ నిర్వహించిన వికసిత్‌ వైబ్రంట్‌ విలేజ్‌ కార్యక్రమం–2026లో పాల్గొన్న యువతతో ఆదివారం ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌ విధానంలో సంభాషించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 245 జిల్లాలకు చెందిన 5,000 మంది మై భారత్‌ వాలంటీర్లు పాల్గొన్నారు. కలెక్టరేట్‌ నుంచి పలువురు యువకులు, జిల్లా యువజన, క్రీడల అధికారి పరంధామ రెడ్డి, మేరా యువ భారత్‌ నోడల్‌ అధికా రి కమరతపు భానుచందర్‌ పాల్గొన్నారు.

కలప తరలిస్తున్న వాహనం పట్టివేత

తరలించినవారి వివరాలు చెప్పని అధికారులు

పాల్వంచరూరల్‌: అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్ట్‌ అధికారులు పట్టుకున్నారు. ఎఫ్‌డీఓ బాబు కథనం ప్రకారం.. శనివారం అర్ధరాత్రి ఉల్వనూరు నుంచి పాల్వంచ వైపు టీఎస్‌ 28 టీఏ 3524 ట్రాలీ వాహనాన్ని బేస్‌ క్యాంప్‌ సిబ్బంది తనిఖీ చేయగా అందులో రూ.18,945 విలువ గల బిల్లుడు జాతికి చెందిన కలపను పట్టుకున్నారు. రేంజర్‌ కవిత మాదురి అర్ధరాత్రి చెక్‌పోస్టు వద్దకు వెళ్లి వాహనాన్ని సీజ్‌ చేసి కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌డీఓ తెలిపారు. కానీ, కలపను తరలిస్తున్నవారి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఇంతకు వారు వాహనంతోపాటు దొరికారా? దొరికిన తర్వాత పారిపోయారా? లేదా వదిలేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై రేంజర్‌ను పలుమార్లు ఫోన్‌ ద్వారా వివరణ కోరేందుకు యత్నించినప్పటికీ స్పందించలేదు. ఎఫ్‌డీఓ బాబును వివరణ కోరగా కలపను తరలించే వ్యక్తుల వివరాలు తనకు కూడా రేంజర్‌ చెప్పలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement