బస్సును ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొట్టిన లారీ

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

పలువురికి గాయాలు

దమ్మపేట: స్టాప్‌ పాయింట్‌ వద్ద ఆగిన ఆర్టీసీ బస్సును ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టిన ఘటన మండలంలోని ముష్టిబండ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులకథనం ప్రకా రం.. సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపునకు వెళ్తున్న క్రమంలో మండలంలోని ముష్టిబండ గ్రామంలో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆగింది. సత్తుపల్లి నుంచి అతివేగంతో వస్తున్న లారీ, ఆగి ఉన్న బస్సు ను కుడి పక్కన వెనుక భాగంలో బలంగా ఢీకొట్టింది. ఇస్లావత్‌ లక్ష్మి, అసిమ్‌ సిద్ధిక్‌ తీవ్రంగా గాయపడగా.. దుర్గ, సందీప్‌, సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ఇస్లావత్‌ లక్ష్మి, అసిమ్‌ సిద్ధిక్‌ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నాగుల మారేశ్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, దర్యా ప్తు చేపట్టామని ఎస్‌ఐ రాజేశ్‌కుమార్‌ తెలిపారు.

భార్య, ఇద్దరు పిల్లలు

అదృశ్యం

టేకులపల్లి: భార్య, ఇద్దరు పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోయి, తిరిగి రాలేదు. ఈ ఘటన మండలంలోని తొమ్మిదోమైలు తండాలో ఆలస్యంగా వెలుగుచూసింది. తండాకు చెందిన భూక్యా మంగీలాల్‌ భార్య విజయ (30), వారి పిల్లలు భూక్య అనుశ్రీ (9)), భూక్య మోక్షిత్‌ (6) ఈ నెల 16వ తేదీన ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో భర్త మంగీలాల్‌ ఈ నెల 20న టేకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన గుగులోతు వెంకన్నపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడే తన భార్యాపిల్లలను తీసుకెళ్లి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో బాధితుడు ఆదివారం విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్‌ఐ తిరుపతిని వివరణ కోరగా భూక్య మంగీలాల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారని, కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు

దమ్మపేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. దమ్మపేట అర్బన్‌కాలనీకి చెందిన జొన్నకూటి వెంకటేశ్వరరావు(40) తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ఈ నెల 25న ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ రాజేశ్‌కుమార్‌ తెలిపారు.

ఇసుక లారీలకు అడ్డుకట్ట

అశ్వాపురం: మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంలో ఇసుక లారీలను ఆదివారం రాత్రి గ్రామస్తులు అడ్డుకున్నారు. రాంనగర్‌ ఇసుక ర్యాంపు నుంచి ఇసుక లారీలు గ్రామంలోని వంతెనపై రావడం వల్ల బ్రిడ్జి ధ్వంసం అవుతోందని గ్రామస్తులు వంతెనపై లారీలను అడ్డుకున్నారు. ఇసుక లారీల రాకపోకల వల్ల సీతారామ కెనాల్‌ కట్ట అస్తవ్యస్తంగా మారిందని, పొలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరకట్ట పూర్తిగా ధ్వంసమవుతోందని కాల్వపై ఉన్న సిల్ట్‌ను కాల్వలోకి నెడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామస్తులు ఆపిన లారీల్లో ఓ లారీకి డీడీ లేనట్టు సమాచారం. ఎస్‌ఐ రాజేశ్‌ ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో తీవ్రగాయాలు

నేలకొండపల్లి: మతిస్థిమితం లేని ఓ యువకుడు విద్యుత్‌ ట్రాన్సఫార్మర్‌ను పట్టుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. మంగాపురంతండాకు చెందిన నాగేశ్వరరావుకు మతిస్థిమితం తప్పింది. ఆయన ఆదివారం గ్రామంలో పరుగులు తీస్తూ ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. ఈ క్రమాన షాక్‌కు గురై కేకలు వేస్తుండడంతో స్థానికులు ఆయనను కర్రల సాయంతో విడదీశారు. అప్పటికే చేతులు కాలి రక్తస్రావం అవుతుండడంతో 108 వాహనంలో ఖమ్మం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement