రుగ్మతలు లేని సమాజ స్థాపనకు కృషి | - | Sakshi
Sakshi News home page

రుగ్మతలు లేని సమాజ స్థాపనకు కృషి

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

ఖమ్మంగాంధీచౌక్‌: రుగ్మతలు లేని సమాజ స్థాపన కోసం విద్యావంతులు కృషి చేయాలని కవి, రచయిత, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అంగలకుర్తి విద్యాసాగర్‌ సూచించారు. నిబద్ధతతో ఎవరి పని వారు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పాటుపడాలని తెలిపారు. ఈ అంశాలే ప్రాతిపదికన కోమాకుల సీతారాములు ‘హాస్టల్‌ కతలు‘పుస్తకం రాశారని తెలిపారు. కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్‌ సీతారాం అధ్యక్షతన ఆదివారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో బహుజన సాహిత్య వేదిక ఆధ్వర్యాన సీతారాములు రచించిన పుస్తకావిష్కరణ సభ జరిగింది. కార్యక్రమంలో విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. ‘హాస్టల్‌ కతలు‘పుస్తకంలో సీతారాములు జీవితంలోని అను భవాలు యదార్థ ఘటనలే కాక సమాజ స్థితిగతులను పొందుపర్చారని తెలిపారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ భూక్యా భంగ్యా మాట్లాడుతూ.. హాస్టళ్లలో చదివిన అందరి జీవితాల్లోని ఘటనలు ఈ పుస్తకంలో కనిపిస్తున్నాయని చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు ప్రసేన్‌, టీజీవోస్‌ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు, రాచమల్ల ఉపేందర్‌ మాట్లాడారు. అనంతరం సినీ సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియోను సత్కరించగా.. ఆయన మాట్లాడారు. తన కు తెలుగు భాష నేర్పిన గురువు సీతారాములు ఎందరో గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఆ తర్వాత సీతారాములు– సావిత్రి దంపతుల 70వసంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సహకార శాఖ జిల్లా రిటైర్డ్‌ అధికారి సయ్యద్‌ ఖుర్షీద్‌తో పాటు లెనిన్‌ శ్రీనివాస్‌, మద్దెర్ల రమేశ్‌, పంజాల ఐలయ్య, కె.రమేశ్‌, కె.రామారావు, అరుణకుమారి, వెంకటేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, మొగిలి గుణక ర్‌, లింగాల రవికుమార్‌, కొమిరె వెంకన్న, జి.వీరన్న, కార్డియాలజిస్ట్‌ సీతారాం, సుబ్బారావు, పిచ్చిరెడ్డి, నాగేశ్వరరావు, మల్లేశం గోపాల్‌రావు పాల్గొన్నారు.

‘హాస్టల్‌ కతలు’పుస్తకావిష్కరణలో

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి విద్యాసాగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement