డ్రైవర్ మృతి
దమ్మపేట: ట్రాక్టర్ ఇంజన్ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతిచెందిన ఘటన శ్రీరాంపురం శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకా రం.. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన బెజవాడ ప్రేమ్‌కుమార్ (38) ట్రాక్టర్ ఇంజన్‌ను నడుపుతూ, మండలంలోని గండుగులపల్లి నుంచి బుగ్గపాడు వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ శ్రీరాంపురం సమీపంలోని నిర్మాణంలో ఉన్న వంతెన వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తాపడింది. తలకు తీవ్రగాయలు కావడంతో ప్రేమ్‌కుమార్‌అక్కడికక్కడే మృతిచెందాడు.
తండ్రి మందలించాడని తనయుడి ఆత్మహత్య
దమ్మపేట: తండ్రి మందలించాడని మనస్తాపంతో తనయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాచూరుపల్లి గ్రామ పరిధిలోని దిబ్బగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాచూరుపల్లి గ్రామ పరిధిలోని దిబ్బగూడెం గ్రామానికి చెందిన చిలకా వెంకన్నబాబు (19) ఏ పనిచేయకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు. అతడిని తండ్రినాగ రాజు శనివారం మందలించాడు. దీంతో అదేరోజు రాత్రి యువకుడు సీలింగ్ ఫ్యాను కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ రాజేశ్‌కుమార్ తెలిపారు.
లీగల్ మెట్రాలజీ శాఖ అధికారుల దాడులు
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని చర్ల రోడ్డులో గల పాత మార్కెట్‌లోని మాంసాహార విక్రయ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) అధికారి సుభాష్ ఆదివారం దాడు లు నిర్వహించారు. ఆయా వ్యాపారు లు వినియోగిస్తున్న కాటాలను తనిఖీ చేశారు. కాగా, తూకంలో వినియోగదారులను మోసం చేస్తున్న పది మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పలు రకాల కాటాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


