జానకమ్మకు స్వర నీరాజనం.. | - | Sakshi
Sakshi News home page

జానకమ్మకు స్వర నీరాజనం..

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

భద్రాచలంటౌన్‌: దక్షిణ భారత గానకోకిల, దివంగత గాయని ఎస్‌.జానకికి నివాళిగా భద్రాచలంలో ‘జానకమ్మకు స్వర నీరాజనం’పేరిట నిర్వహించిన సంగీత విభావరి వైభవంగా సాగింది. పట్టణంలోని కాకతీయ గ్రాండ్‌ (కమ్మ సత్రం) వేదికగా ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, మాట్లాడారు. సినిమా సంగీత ప్రపంచంలో ఎస్‌.జానకి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆమె పాటలు తరాలు మారినా శ్రోతల గుండెల్లో నిలిచిపోతాయని కొనియాడారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాన్‌ స్టాప్‌గా సాగిన ఈ కార్యక్రమంలో 25 మంది గాయనీగాయకులు పాల్గొన్నారు. జానకమ్మ ఆలపించిన ఎన్నో సూపర్‌ హిట్‌, భక్తిరస, మెలోడీ గీతాలను వారు తమ పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.

అలరించిన సంగీత విభావరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement