విద్యార్థులకు నవోదయం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నవోదయం

Jul 26 2026 12:15 AM | Updated on Jul 26 2026 12:15 AM

● ఆరు నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్య ● జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో మెరుగైన వసతులు ● 2027–28లో ప్రవేశాల దరఖాస్తు గడువు ఈ నెల 31 ●సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధన ●జిల్లాకు గతేడాదే మంజూరు ప్రతిభ ఆధారంగా ఎంపిక..

● ఆరు నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్య ● జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో మెరుగైన వసతులు ● 2027–28లో ప్రవేశాల దరఖాస్తు గడువు ఈ నెల 31

ఆరో తరగతిలో సీటు సాధిస్తే ఇంటర్మీడియట్‌ (12వ తరగతి) వరకు ఉచితంగా విద్యనభ్యసించవచ్చు. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. త్రిభాషా సూత్రం తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై విద్యార్థులకు పూర్తిస్థాయి పట్టు సాధించేలా బోధన ఉంటుంది. పుస్తక విజ్ఞానంతోపాటు క్రీడలు, యోగా, ధ్యానం, చిత్రలేఖనం, సంగీతంలలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు, చక్కటి మెనూతో భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్‌ విద్య అందిస్తారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జిల్లాకు కేంద్ర ప్రభుత్వం గతేడాది కొత్తగా నవోదయ పాఠశాలను మంజూరు చేసింది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో 30 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవన నిర్మాణం చేపడుతున్నారు. భవనం పూర్తయ్యేవరకు కరకగూడెం జెడ్పీ పాఠశాలలో తాత్కాలికంగా విద్యాలయ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 50 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు. తాజాగా ఆరో తరగతిలో 40 సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 31లోగా https:// navodaya. gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్థులకు జవహర్‌ నవోదయ విద్యాలయ స్వాగతం పలుకుతోంది. 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే నవోదయ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. విలువలు, దేశభక్తి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలను సమ్మిళితం చేస్తూ బోధన సాగిస్తున్నారు. – కరకగూడెం

నవోదయ విద్యాలయలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రవేశ పరీ క్షలో 100 మార్కులకు గాను 80ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉం టాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని ఉన్నత విద్యకు బలమైన పునాది వేసుకోవ చ్చు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులు ఎంపికవుతారు.

–రత్నయ్య, నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement