రామయ్యకు సువర్ణ తులసీ అర్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

Jul 26 2026 12:15 AM | Updated on Jul 26 2026 12:15 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కరువు పరిస్థితులు పోవాలని దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం శ్రీరామాత్మక వరుణ యాగం జరి పారు. ఈ సందర్భంగా బేడా మండపంలో కొలువై ఉన్న నిత్య కల్యాణ ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం గావించారు. వారాంతపు సెలవు రోజులు కావడంతో ఆలయంలో, గోదావరి తీరంలో భక్తుల రద్దీ నెలకొంది.

‘పోలీస్‌ అక్క’ విధులపై అవగాహన

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో అమలు చేయనున్న ‘పోలీస్‌ అక్క’విధులపై మహిళా పోలీసు సిబ్బందికి ఎస్పీ రోహిత్‌రాజు అవగాహన కల్పించారు. శనివా రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నియమితులైన మహిళా పోలీస్‌ కానిస్టేబుళ్లు పోలీస్‌ అక్కగా విద్యాసంస్థలను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్‌ నేరాల నివారణ, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ర్యాగింగ్‌ నిరోధం, ఈవ్‌ టీజింగ్‌, బాల్య వివా హాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేసేలా విశ్వాసాన్ని కల్పించాలని సూ చించారు. పోలీస్‌ అక్క కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి మహిళలు, బాలికల భద్రతకు మరింత భరోసా కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, షీటీం ఎస్‌హెచ్‌ఓ రమాదేవి పాల్గొన్నారు.

సేంద్రియ ఉత్పత్తులకు ప్రోత్సాహం

ఏపీఓ డేవిడ్‌ రాజ్‌

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ పరిధి లోని భద్రగిరి మార్ట్‌ ద్వారా సేంద్రియ (ఆర్గానిక్‌), అటవీ ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేసి ప్రోత్సహిస్తామని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్‌ తెలిపారు. ఏపీలోని ఎటపాక మండలం కొత్తూరు నారాయణపురం గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలు సాగు చేస్తున్న బ్లాక్‌ రైస్‌ (నల్ల బియ్యం) పంటలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రగిరి మార్ట్‌లో ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబా టులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించే రైతులు, మహిళా సంఘాల నుంచి నేరుగా బ్లాక్‌ రైస్‌తో పాటు ఇతర ఆర్గానిక్‌ ధా న్యాలు, స్వచ్ఛమైన పాలు, నెయ్యి, తేనె, నిల్వ పచ్చళ్లు, మిల్లెట్‌ ఉత్పత్తులను ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎటపాక ఏపీఓ భాస్కరరావు, జీసీసీ మేనేజర్‌ జయరాజ్‌, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, మహిళా రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement