ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

Jul 26 2026 12:15 AM | Updated on Jul 26 2026 12:15 AM

చుంచుపల్లి: ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్‌ చేశా రు. తెలంగాణ గ్రాడ్యుయేట్‌ ఫోరం ఆధ్వర్యంలో విద్యానగర్‌ కమ్మ సత్రంలో శనివారం వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పరిపాలన చేయడం మాత్రమే కాకుండా నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయడం కూడా చేతకావడం లేదని విమర్శించారు. నిర్మించడం, నిలబెట్టడం కాకుండా కూల్చివేయడం, పడగొట్ట డం తప్ప ప్రభుత్వం చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించా రు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, దిండిగాల రాజేందర్‌, సలిగంటి శ్రీనివాస్‌, కాపు సీతామహాలక్ష్మి, అబ్రహం, మండవ సుబ్బారావు, శంకర్‌రెడ్డి, భూపతి శ్రీనివాసరావు, గోపాల్‌రావు, మసూద్‌, అవుటుపల్లి రాంబాబు, బండి విజయభాస్కర్‌, పూల రవీందర్‌, అనుదీప్‌, అజిత్‌, వీరభద్రం, బొమ్మిడి రమాకాంత్‌, సర్పంచులు బాదావత్‌ శ్రీకాంత్‌, బలరామ్‌, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement