పాల్వంచరూరల్: పాల్వంచ మండలం నాగారం వాసి తిర్లకుండ వీరయ్య కుటుంబ వారసత్వంగా కుండలు చేసినా ఆదరణ లేక అమ్మకాలు జరగక పూట గడవడం కష్టమైంది. దీంతో ప్రత్యామ్నాయ ఉపాధిపై దృష్టి సారించిన ఆయన అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు! వీరయ్యకు ద్విచక్రవాహనం ఉండగా.. రెండు చక్రాలతో తోపుడుబండి మాదిరిగా చేయించి ట్రాక్టర్ ట్రక్ తరహాలో దానికి అమర్చాడు. దీనిపై కట్టెల పొయ్యి పెట్టి పాత్రలో స్వీట్ కార్న్, కంకులు ఉడకబెడుతూ ఊరు రా తిరిగి విక్రయిన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి కంకులు విక్రయిస్తే ఖర్చులు పోగా రోజుకు రూ.500 నుంచి రూ.600 మిగులుతున్నాయని వీరయ్య తెలిపారు.


