భారీగా గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

భారీగా గంజాయి పట్టివేత

Jul 26 2026 12:15 AM | Updated on Jul 26 2026 12:15 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలం పట్టణంలో శనివారం భారీగా గంజాయి పట్టుబడింది. కూనవరం రోడ్డు లోని వీరభద్ర ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో ఎకై ్సజ్‌ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వివరాలను ఖమ్మం ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వి.సోమిరెడ్డి వెల్లడించారు. జిల్లా డిప్యూటీ ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ అధికా రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా, వేగంగా వెళ్తున్న కారు (జేఏ03 ఏఆర్‌5892)ను ఆపి తనిఖీ చేశారు. ఆరు బ్యాగుల్లో 101 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన సత్తిపాపా, హర్బజ్‌ హుస్సేన్‌, గుల్జార్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.50.50 లక్షల విలువైన గంజాయి, కారు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని కమిషనర్‌ వివరించారు. తనిఖీల్లో సీఐ రహీమున్నీసా, ఎస్‌ఐ సీతారామరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ కరీం, సీతారాం, సిబ్బంది భద్రం, రాకేశ్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

పాల్వంచలో..

పాల్వంచ: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని వనమాకాలనీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు మోటార్‌ సైకిల్‌పై అనుమానాదాస్పదంగా వె వెళ్తుండగా ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌లో 3.100 కేజీల గంజాయి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వీరు తెలంగాణానగర్‌కు చెందిన ముగితి హేమంత్‌, సానబోయిన శ్రావణ్‌కుమార్‌గా గుర్తించారు. మోటార్‌ సైకిల్‌తో పాటు సెల్‌ఫోన్‌, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేశారు.

నలుగురి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement