అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగార ఉద్యో గ సంఘం అధ్యక్షుడిగా టీఎన్‌టీయూసీ కూటమికి చెందిన సీహెచ్.బాల ఎన్నికయ్యారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా రాయల రాజేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగ సంఘం ఎన్నికల పోలింగ్ గురువారం జరగగా, శుక్రవారం ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీఎన్‌టీ యూసీ – బీఎంఎస్ కూటమి, టీఆర్‌టీయూ – సీఐ టీయూ కూటమి, ఐఎన్‌టీయూసీ ఒంటరిగా పోటీ చేశాయి. టీఎన్‌టీయూసీ కూటమి నుంచి గౌరవ అధ్యక్షుడిగా మధమంచి వెంకటేశ్, అధ్యక్షుడిగా సీహెచ్.బాల విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా రాయల రాజేశ్, సంయుక్త కార్యదర్శిగా రామ్‌చంద్ర జైస్వాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పన్నాలాల్ కుమావత్, కార్యాలయ కార్యదర్శిగా షేక్ హుస్సేన్‌అలీ, కోశాధికారిగా రాజ య్య ఎన్నికయ్యారు. ఇక సీఐటీయూ – టీఆర్‌టీయూ కూటమి నుంచి ఉపాధ్యక్షుడిగా యన్నా సుధీర్, సంక్షేమ కార్యదర్శిగా గాదె ఊహశ్రీ విజ యం సాధించారు. ఇక 11 ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు గాను ఎనిమిది టీఎన్‌టీయూసీ కూటమి, రెండు సీఐటీయూ కూటమి, ఒకటి ఐఎన్‌టీయూసీ దక్కించుకున్నాయి. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని విజేతలు తెలిపారు.


