గురుపౌర్ణమి వేడుకల్లో భాగంగా ఖమ్మం గాంధీచౌక్‌లోని వరప్రదాత షిర్డీ సాయి మందిర్‌లో సాయిబాబాను శుక్రవారం కరెన్సీ నోట్ల మాలలతో అలంకరించారు. తొలుత బాబాకు అన్నాభిషేకం చేశాక అలంకరించగా.. మందిరం చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన చంఢీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అలాగే, రంగనాయకుల గుట్టపై ఉన్న శ్రీకృష్ణసాయి ఆశ్రమంలో గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా చైర్మన్ లగడపాటి రామారావు ఆధ్వర్యంలో చంఢీహోమం నిర్వహించారు. సాయినాథుడికి కొబ్బరి నీళ్లతో
అభిషేకం, పుష్పాభిషేకం చేశాక భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
– ఖమ్మంగాంధీచౌక్


