ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ పరిధి హనుమంతులపాడులో రెండు కుటుంబాల మధ్య భూవివాదం సుదీర్ఘకాలంగా సాగుతోంది. తహసీల్, పోలీస్‌స్టేషన్లను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. గ్రామానికి చెందిన గడబోయిన సత్యం తనకు ఉన్న రెండు ఎకరాల భూమిలో 34 గుంటలు తనఖా పెట్టి రావుల సత్యమ్మ నుంచి రూ.45 వేలు తీసుకున్నట్లు చెబుతున్నాడు. అయితే, తనఖా పెట్టలేదని తనకు విక్రయించారని సత్తెమ్మ వాదిస్తోంది. ఈ క్రమాన సత్తెమ్మ చేను దున్నుతుండగా, అడ్డుకున్న సత్యం కుటుంబ సభ్యులు పొలంలోనే గుడారం వేసుకుని ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమాన సత్తెమ్మ కూడా అదే భూమిలో బైఠాయించింది. ఐదు రోజులుగా సాగుతున్న ఈ వివాదంపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు అందినా స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
పొలంలోనే ఐదు రోజులుగా బైఠాయింపు


