36 పోస్టులు.. 750 దరఖాస్తులు! | - | Sakshi
Sakshi News home page

36 పోస్టులు.. 750 దరఖాస్తులు!

Jul 24 2026 12:22 AM | Updated on Jul 24 2026 12:22 AM

పాల్వంచరూరల్‌: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 36 ఉపాధ్యాయ పోస్టులను తాత్కాలిక విధానంలో భర్తీ చేసేందుకు అధికారులు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. అనూహ్యంగా 750 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరికి గురువారం పాల్వంచలోని గురుకుల బాలుర కళాశాలలో డెమో, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయగా 450 మంది హాజరయ్యారు. ఈ మేరకు టెంట్‌, కుర్చీలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారి పేర్లతో జాబితాను ఇంటర్‌ నోడల్‌ అధికారి, డీఈఓలకు పంపించామని గురుకులాల జోనల్‌, సమన్వయ అధికారులు అపర్ణ, కె.వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement