ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ) గైడ్‌వాల్ నిర్మాణంలో డొల్లతనం నిజమేనని అధికారులు అంగీకరించినట్లయింది. నిర్మాణ దశలోనే పలుచోట్ల గోడలు బీటలు వారడం, పగుళ్లు వచ్చాయని ‘సీతారామ గైడ్‌వాల్‌కు బీటలు’శీర్షికన గత ఏడాది ఏప్రిల్ 20న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో ఇన్నాళ్లు పెద్దగా స్పందించని అధికారులు.. ఇప్పుడు గోదావరి జలాల ఎత్తిపోతలు మొదలుకావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు.
కొన్నాళ్లకే..
ములకలపల్లి మండలంలోని పంప్‌హౌస్–2 (వీ.కే.రామవరం) నుంచి పంప్‌హౌస్–3 (కమలాపురం)కు వెళ్లే మెయిన్ కెనాల్‌పై రామాంజనేయపురం శివారులో బీటీ రోడ్డుపై వంతెన నిర్మించారు. ఈ వంతెన దాటి కమలాపురం వెళ్లే ప్రధాన కాల్వపై ఎగువ ప్రాంతంలో వరద కాల్వ దాటేందుకు మరో సూపర్ పాసేజ్ నిర్మించారు. పాసేజ్ నుంచి ప్రధాన కాల్వపై కొంతమేర సిమెంట్ లైనింగ్ (రివిట్‌మెంట్) వేసి, దానిని ఆనుకుంటూ గైడ్‌వాల్ నిర్మించారు. స హజంగా లైనింగ్ కంటే గైడ్‌వాల్ బలంగా ఉండాల్సి ఉండగా.. కమలాపురం వెళ్లే ప్రధాన కాల్వకు ఎడవువైపున పగుళ్లు ఏర్పడ్డాయి. అంతేకాక సిమెంట్ లైనింగ్ పగిలి ముక్కలుగా విరిగిపోయింది. ఈ మేరకు స్పందించిన అధికారులు దెబ్బతిన్న గైడ్‌వాల్‌ను పూ ర్తిగా తొలగించి నూతన నిర్మాణాలు మొదలు పెట్టా రు. తొలుత పనులు చేసిన ఏజెన్సీతో ఈ నిర్మాణాలు చేయిస్తున్నారు. ఈ అంశంపై డీఈ రవీందర్ తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానన్నారు. బీటలు వారిన, పగుళ్లు వచ్చిన ప్రదేశంలోని గైడ్‌వాల్ తొలగించి కొత్త నిర్మాణాలు మొదలుపెట్టామన్నారు. ప్రధాన కాల్వ ద్వారా కమలాపురం పంప్‌హౌస్–3కు గోదావరి జలాల తరలుతున్నాయని, మోటార్లు నిలిపివేశాక మిగిలిన పనులు చేపడుతామని తెలిపారు.
‘సీతారామ’ గైడ్‌వాల్స్ తీరిది...


