సూపర్‌బజార్(కొత్తగూడెం): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యాన గురువారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా గేట్లు తోసుకుని లోపలకు చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొంది. నాయకులు ప్రధాన ద్వారం గేట్లు ఎక్కి అధికారులు బయటకు రావాలని నినాదాలు చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ ఏఓ రామకృష్ణ వినతిపత్రాన్ని స్వీకరించారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ.. విద్యారంగం, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు మంజూరు కాక విద్యార్థులు ఇబ్బంది పడుతూ చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా విద్యాశాఖకు మంత్రిని నియమించి, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఇనపల్లి పవన్‌సాయి, గుండాల సుజన్, గుగులోత్ వంశీ, మాణిక్యాల వినయ్, అక్కినపల్లి నాగేంద్రబాబు, కొరిమి సంజయ్ పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదలకు డిమాండ్


