చర్ల: గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ బి.నాగలక్ష్మి సూచించారు. చర్ల మండలం దేవరపల్లి, ఆర్.కొత్తగూడెం, సత్యనారాయణపురం గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా దేవరపల్లి, సత్యనారాయణపురం, దానవాయిపేటలోని పాఠశాలల్లో మొక్కలు నాటిన ఆమె ఆర్.కొత్తగూడెంలో ఇంకుడుగుంతల నిర్మాణాలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో సీఈఓ గ్రామాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. అంతేకాక ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతల ఏర్పాటు, మొక్కలు నాటేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సర్పంచ్‌లు తెల్లం సుజాత, తుర్రం రవికుమార్, చిక్కాల గౌతమి ఎంపీడీఓ ఈదయ్య, ఎంపీఓ మూర్తి, ఉద్యోగులు లక్ష్మీదుర్గ, సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి


