మణుగూరుటౌన్/పినపాక/అశ్వాపురం/కరకగూడెం: ఎఫ్‌ఎల్‌ఎన్ (పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం) కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకోవాలని డీఈఓ డి.వాసంతి సూచించారు. మణుగూరు, పినపాక, అశ్వాపురం మండలం మిట్టగూడెం, కరకగూడెంలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. వృత్యంతర శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధనలో అమలుచేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ప్రతీ విద్యార్థిలో కనీస సామర్థ్యాలు పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి టి.మాధవరావు, ఎంఈఓలు స్వర్ణజ్యోతి, కొమరం నాగయ్య, వి.వీరస్వామి, మంజులతో పాటు ఆర్‌పీలు రాజేశ్వరరావు, కృష్ణయ్య, బాబూరావు, షాలిని, సూర్యనారాయణ, భావ్‌సింగ్, తిరుమల్‌రావు, గోపాలకృష్ణ పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి


