వైటీసీతో గిరిజన యువతకు ఉపాధి శిక్షణ | - | Sakshi
Sakshi News home page

వైటీసీతో గిరిజన యువతకు ఉపాధి శిక్షణ

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

ఐటీడీఏ పీఓ రాహుల్‌

అశ్వారావుపేట: గిరిజన యువతీ, యువకులకు యువజన శిక్షణ కేంద్రం(వైటీసీ) ద్వారా ఉపాధి రంగాల్లో శిక్షణ అందుతుందని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌ తెలిపారు. అశ్వారావుపేటలో ఐటీడీఏ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన వైటీసీని ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ రాహుల్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఖమ్మం, భద్రాచలం, ఇల్లెందులో వైటీసీలు ఉండగా, అశ్వారావుపేటలోనూ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ అన్ని వసతులతో ఉపాధి రంగాల్లో ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌లో స్థిరపడాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే రాణించవచ్చని తెలిపారు. అశ్వారావుపేట మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌ రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ జూపల్లి రమేష్‌ బాబు, ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజు, ఎంపీడీవో కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement