కల్యాణం... కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం... కమనీయం

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యా ణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరి పించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆర్టీసీలో అప్రెంటిస్‌ శిక్షణ

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం రీజియన్‌ పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో ఐటీఐ (ఫిట్టర్‌ ట్రేడ్‌ మినహా) పూర్తి చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్‌ఎం సరిరామ్‌ తెలి పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www. apprenticeshipindia. org వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఎస్సెస్సీ, ఐటీఐ మెమో, కుల ధ్రువీకరణపత్రం, బ్యాంక్‌ పాస్‌బుక్‌ తది తర పత్రాలు అప్‌లోడ్‌ చేయాలని సూచించా రు. దరఖాస్తు కోసం ఈనెల 31వరకు గడువు ఉందని ఆయన తెలిపారు.

ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టి

చుంచుపల్లి: అటవీ శాఖ ద్వారా చేపడుతున్న ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి మొక్కలను సంరక్షించాలని భద్రాద్రి సర్కిల్‌ సీసీఎఫ్‌ డాక్టర్‌ డి.భీమా నాయక్‌ సూచించారు. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌తో కలిసి బుధవారం ఆయన కొత్తగూడెం రేంజ్‌ పరిధి హేమచంద్రపురం బీట్‌లో కొత్తగా చేపట్టిన 10 హెక్టార్ల ప్లాంటేషన్‌ పనులను పరిశీలించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున త్వరగా మొక్కలు నాఆటాలని సూచించారు. ఆతర్వాత జిల్లాలో మొక్కల పెంపకం, అటవీ సంరక్షణపై సూచనలు చేశారు.

పంటల మార్పిడితో

రైతులకు ఆదాయం

జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు

చుంచుపల్లి: ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితి ఎదురవుతోందని, రైతులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి ఆదాయం పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్లలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో డీఏఓ మాట్లాడారు. బోరు నీటిపై ఆధారపడి వరిసాగు చేస్తే నీటి కొరత ఏర్పడి దిగుబడి పడిపోతుందన్నారు. ఈమేరకు ఆయిల్‌ పామ్‌, అపరాలు, కూరగాయలు, మొక్కజొన్న, జొన్న వంటి పంట లను సాగు చేయాలని సూచించారు. ఆయిల్‌ పామ్‌ సాగు ద్వారా దీర్ఘకాలం స్థిరమైన ఆదాయం లభిస్తుందని, అపరాలు, మొక్కజొన్న, జొన్నకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ దీపక్‌, ఏఈఓలు పాల్గొన్నారు.

మత్స్యకారులకు

శిక్షణ ప్రారంభం

కూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘జలాశయాల్లో చేపల పెంపకం – యాజమాన్య పద్ధతులు’ అంశంపై ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులకు ఇచ్చే మూడు రోజుల శిక్షణ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ మంచినీటి చేపలకు డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా ఉత్పత్తిపై దృష్టి సారించాలని తెలిపారు. ఇందుకోసం నూతన పద్ధతులను అవలంబించాలని చెప్పారు. అనంతరం శాస్త్రవేత్తలు రవీందర్‌, గణేష్‌, దివ్య మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement