భక్తులకు ఇబ్బందులు లేకుండా పనులు | - | Sakshi
Sakshi News home page

భక్తులకు ఇబ్బందులు లేకుండా పనులు

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చేపట్టాలని ఎమ్మె ల్యే తెల్లం వెంకట్రావు సూచించారు. ‘దారీతెన్నూ లేదు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. పని చేస్తున్న కార్మికులకు రక్షణ సామగ్రి లేకపోగా, ఆంక్షలతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ కథనంలో ప్రస్తావించగా స్పందించిన ఎమ్మెల్యే ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పనులను బుధవారం పరి శీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌, ఈఓ దామోదర్‌రావుకు పలు సూచనలు చేశారు. ప్రతీ పని నాణ్యతగా, నిబంధనల ప్రకారం జరగాలని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత చెక్కు చెదరకుండా చూసుకోవాలని సూచించారు. ఇదేసమయాన కార్మికులకు రక్షణ సామగ్రి అందజేసి, పుణ్యక్షేత్రంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సర్పంచ్‌ పూనెం కృష్ణ, నాయకులు రత్నం రమాకాంత్‌, భీమవరపు వెంకటరెడ్డి, మామిడి పుల్లారావు, నాగేశ్వరరావు, రాయల శ్రీను, గాడి విజయ్‌, మాచినేని భాను, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement