ప్రజల బాగు కోరేది పోలీసులే... | - | Sakshi
Sakshi News home page

ప్రజల బాగు కోరేది పోలీసులే...

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

చర్ల: మండలంలోని మారుమూల గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారులు వంటి సదుపాయాల కల్పన కు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ఎస్పీ రోహిత్‌రాజ్‌ అన్నారు. చర్ల సీఐ రాజువర్మ నేతృత్వాన ఎస్‌ఐ నర్సిరెడ్డి మిత్రులు పీవీ నర్సింహారెడ్డి, పి.రామారావు, పి.కార్తీక్‌, టి.హర్ష, ఈ.రాజేశ్‌, టి.శశిధర్‌రెడ్డి, పి.రమణారెడ్డి, ఎం.సంతోష్‌ గౌడ్‌ సమకూర్చిన రూ.2.50లక్షలతో ఆదివాసీ గ్రామమైన బక్కచింతపాడులో పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఎస్పీ బుధవారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణే కాదు ప్రజల బాగు కోసం కూడా పోలీసులు కృషి చేస్తారని నిరూపించారన్నారు. గత ఏడాది ఆదివాసీ గ్రామమైన బూరుగుపాడులో పాఠశాల భవనం నిర్మించగా, ఇప్పుడు మరొకటి నిర్మించారని తెలిపారు. కాగా, ఆదివాసీలు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలని, అనారోగ్యం ఎదురైతే మూఢనమ్మకాలను ఆశ్రయించకుండా ఆస్పత్రుల్లో సంప్రదించాలని సూచించారు. తొలుత విద్యార్థులకు స్కూల్‌ బ్యా గులు, స్టేషనరీని ఎస్పీ పంపిణీ చేశారు. సర్పంచ్‌ మిడియం లక్ష్మి, డీఎస్‌పీ అరుణ్‌కుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు కేశవ్‌, ఎంఈఓ పీవీ.రమణ, హెచ్‌ఎం పాయం విజయబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి

దుమ్ముగూడెం: అక్రమ ఇసుక రవాణాపై నిఘా ఏర్పాటు చేసి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని, మట్కా, జూదం, కోడి పందేలు, పేకాట, బెట్టింగ్‌, గంజాయి రవాణా జరగకుండా పూర్తిగా నిర్మూలించాలని ఎస్పీ రోహిత్‌ రాజు ఆదేశించారు. దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేసిన ఆయన పెండింగ్‌ కేసులు, దర్యాప్తుపై ఆరా తీశాక ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని తెలి పారు. స్టేషన్‌కు వచ్చే వారికి న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యం కావాలని చెప్పారు. అనంతరం స్టేషన్‌ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్‌, సీఐలు వెంకటప్పయ్య, శ్రీనివాస్‌, ఎస్‌ఐలు శ్యాంప్రసాద్‌, జగన్మోహన్‌చారి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ రోహిత్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement