‘మై భారత్‌’ పోర్టల్‌లో నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘మై భారత్‌’ పోర్టల్‌లో నమోదు చేయాలి

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కేంద్రప్రభుత్వం ప్రారంభించిన మై భారత్‌ పోర్టల్‌ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలు ప్రతీ విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన జిల్లా యువజన కార్యక్రమాల సలహా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. మై భారత్‌ పోర్టల్‌ ద్వారా యువతకు వివిధ రంగాల్లో అవకాశాలు దక్కుతుండగా, ప్రస్తుతం జిల్లాలో సుమారు 9 వేల మంది యువత నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఈ సంఖ్య మరింత పెంచాలని సూచించారు. అలాగే, జిల్లా స్థాయి యూత్‌ పార్లమెంట్‌ నిర్వహణ, వికసిత్‌ భారత్‌, నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా పోటీల నిర్వహణపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు వెంకట్రామ్‌బాబు, విజయలక్ష్మి, శ్రీలత, వెంకటేశ్వరరావు, వసంత, పరంధామరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, డాక్టర్‌ కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ వేణు గోపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement