సిద్ధమైన జియోసైన్స్‌ ల్యాబ్‌ | - | Sakshi
Sakshi News home page

సిద్ధమైన జియోసైన్స్‌ ల్యాబ్‌

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

రుద్రంపూర్‌: సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్‌ పరిధిలో లభించే అరుదైన ఖనిజాలను పరీక్షించి ఫలితాలు వెల్లడించేందుకు రూ.12 కోట్ల వ్యయంతో జియోసైన్స్‌ ల్యాబోరేటరీ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. భూగర్భ, ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో లభ్యమయ్యే రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ను పరీక్షించి నిర్ధారించేందుకు ఈ ల్యాబ్‌ ఉపయోగపడుతుంది. ఇటీవల సింగరేణి యాజమాన్యం కర్ణాటక రాష్ట్రంలోని గోల్డ్‌, కాపర్‌ మైన్స్‌ దక్కించుకోగా, అక్కడి ఖనిజాలను కూడా పరీక్షించి ఫలితాలను వెల్లడిస్తారు. కాగా, డిప్యూటీ సీఎం గురు, శుక్రవారం కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు సింగరేణి ఏరియాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సింగరేణి సీఎండీ డాక్టర్‌ సుదీర్థ భట్టాచార్య, డైరెక్టర్‌ (పా) గౌతం పోట్రు పాల్గొంటారు. సీఎండీగా ఫిబ్రవరి 12న బాధ్యతలు చేపట్టిన భట్టాచార్య మార్చి 7వ తేదీన కొత్తగూడెం వచ్చారు. మళ్లీ రెండోసారి గురువారం రానున్నారు.

నేడు ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement