ల్యాబ్‌ల్లో అర్హులైన సిబ్బంది తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌ల్లో అర్హులైన సిబ్బంది తప్పనిసరి

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

అశ్వారావుపేటరూరల్‌: ప్రైవేట్‌ రక్త పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అర్హులైన సిబ్బందితోనే పరీక్షలు చేయించాలని డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్‌ ఆదేశించారు. మండలంలోని వినాయకపురం పీహెచ్‌సీని బుధవారం తనిఖీ చేసిన ఆయన అశ్వారావుపేట, దమ్మపేట మండ లాల్లోని ప్రైవేట్‌ ల్యాబ్‌ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ప్రతీ రక్త పరీక్షా కేంద్రానికి రిజిస్ట్రేషన్‌ చేయించడమే కాక ఇతర అనుమతులు తీసుకోవాలని తెలిపారు. మలేరియా, డెంగీ పాజిటివ్‌ కేసుల వివరాలను వైద్యశాఖ అధికారులకు అందించాలని సూచించారు. అలాగే, ఫీజుల విషయంలో ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో వైద్యాధికారులు రాందాస్‌, నౌషిన్‌, సబ్‌ యూనిట్‌ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement