రెడ్‌కో ఇంజనీర్‌ బంధువుల ఇంట్లో ఏసీబీ సోదాలు | - | Sakshi
Sakshi News home page

రెడ్‌కో ఇంజనీర్‌ బంధువుల ఇంట్లో ఏసీబీ సోదాలు

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

పాల్వంచ: టీజీ ఆర్‌డీసీఓ డిప్యూటీ ఇంజనీర్‌ ముత్యం వెంకటరమణకు చెందిన బంధువుల ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదా చేశారు. పాల్వంచ రాహుల్‌గాంధీ నగర్‌లో ఉండే ఇంజనీర్‌ బంధువు ఇంట్లో ఏసీబీ ఖమ్మం డీఎస్పీ వై.రమేశ్‌ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. రెడ్‌కో డిప్యూటీ ఇంజనీర్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో మాధాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బంధువుల ఇళ్లలో సోదా చేశారు. ఈ క్రమాన పాల్వంచలో కూడా తనిఖీ చేయగా, అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

భూసార పరీక్షలతో

రైతులకు మేలు

బూర్గంపాడు: రైతులు భూసార పరీక్షల ప్రా ముఖ్యతను గుర్తించాలని, ఈ పరీక్షలతో వచ్చే నివేదికల ఆధారంగా పంటల సాగు చేస్తే నష్టా లు రావని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌ (ఐఐఆర్‌ఆర్‌) అసోసియేట్‌ డాక్టర్‌ రవి రాజు సూచించారు. బూర్గంపాడులోని పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద ఫ్మారర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌పీఓ) ఆధ్వర్యాన భూసార పరీక్షలు, వరి నేరుగా విత్తే విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవిరాజు మాట్లాడుతూ.. రైతులు భూసార పరీక్షలు చేయించి నేలలోని పోషక పదార్థాల ఆధారంగా ఎరువులను వాడాలని తెలిపారు. కాగా, వరి నేరుగా విత్తుకునే విధానంలో పెట్టుబడులు తగ్గుతాయని వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బిక్కసాని శ్రీనివాసరావు, సీఈఓ బీ.వీ.ప్రసాద్‌, రైతులు పాల్గొన్నారు.

రేపు కలెక్టరేట్‌లో

ఫుడ్‌ లైసెన్స్‌ మేళా

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో ఈ నెల 24న ఫుడ్‌ లైసెన్స్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆహార భద్రతాధికారి శరత్‌ తెలిపారు. జిల్లా పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌ షాపులు, బేకరీలు, కిరాణా దుకాణాలు, పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారులు, ఇతర ఆహార వ్యాపార సంస్థల యజమానులు కొత్త లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌, పునరుద్ధరణ, సవరణ సేవలను పొందొచ్చని వెల్లడించారు. కాగా, తత్కాల్‌ ఫుడ్‌ లైసెన్స్‌ పేరిట ఎవరైనా సంప్రదిస్తే రుసుము చెల్లించొద్దని ఆయన తెలిపారు.

నేడు భారజల కర్మాగారం ఉద్యోగ సంఘం ఎన్నికలు

అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగారం ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం జరగనున్నాయి. కర్మాగారంలోని క్యాంటీన్‌–1లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా రాయల రాజేశ్‌, సంయుక్త కార్యదర్శిగా రామచంద్ర జైస్వాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 11 ఎగ్జిక్యూటివ్‌ సభ్యుల స్థానాల్లో ఎనిమిది ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు స్థానాలకు ఆరుగురు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో టీఎన్‌టీయూసీ – బీఎంఎస్‌ కూటమి, సీఐటీయూ – టీఆర్‌టీయూ కూటమి, ఐఎన్‌టీయూసీ బరిలో ఉన్నాయి. కాగా, పోలైన ఓట్లను ఈ నెల 24న లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.

మోసపోయిన

పండ్ల వ్యాపారి

మామిడి పండ్లు పంపిస్తామని నగదు స్వాహా

పాల్వంచ: పండ్ల వ్యాపారికి ఫోన్‌ చేసి మామిడి కాయల లోడ్‌ పంపిస్తామని ఆశచూపి, డబ్బు లు స్వాహా చేసిన ఘటన ఇది. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన గుత్తుల సత్యనారాయణకు గత జూన్‌ 21వ తేదీన ఖదిర్‌పాషా అనే వ్యక్తి ఫోన్‌ చేసి తాను కేజీఎన్‌ మార్కెట్‌ నుంచి మాట్లాడుతున్నానని, గతంలో మామిడి పండ్లు కొన్నారని, ఇప్పుడు మంచి కాయలు వచ్చా యని చెప్పి మామిడి పండ్ల ఫొటోలను వాట్స ప్‌ ద్వారా పంపాడు. అడ్వాన్స్‌గా రూ.10 వేలు ఇస్తే డోర్‌ డెలివరీ చేస్తామని నమ్మబలికాడు. అనంతరం మరో రూ.11 వేలు వేయాలని, తర్వాత బండి రిపేర్‌ అయిందని చెప్పి మొత్తం రూ.45 వేలు ఫోన్‌ పే చేయించుకున్నాడు. అనంతరం ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ చేశాడు. దీంతో సత్యనారాయణ కేజీఎన్‌ మార్కెట్‌లో ఆరా తీయగా అలాంటి వ్యక్తి ఎవరూ లేరని తేలడంతో మోసపోయినట్లు గుర్తించాడు. బుధవారం బాధితుడి కుమారుడు జశ్వంత్‌ ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement