సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులు వరికి బదులు ప్రత్యా మ్నాయ పంటలను సాగు చేయడం మంచి దని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రో గ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ సూచించారు. 50–75 మి.మీ. వర్షపాతం ఒక వారం రోజుల్లో నమోదైతే జూలై నెలాఖరు వరకు తక్కువ కాలవ్యవధి (90 రోజుల్లోపు) ఉన్న మొక్కజొన్న హైబ్రిడ్లు, వేరుశనగ, సజ్జ, తేలిక నేలల్లో పొద్దుతిరుగుడు పంటలను విత్తుకోవచ్చని తెలిపారు. రాగి పంటను ఆగస్టు నెలాఖరు వరకు, బరు వు నేలల్లో పొద్దుతిరుగుడు పంటను ఆగస్టు 30వ తేదీ వరకు విత్తుకోవచ్చని వివరించారు. రాబోయే ఐదారు రోజుల పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున పంటల తీగలకు బలమైన వెదురు కర్రలతో ఊతం ఇవ్వాలని ఆయన సూచించారు.
● వరి: రైతులు స్వల్పకాలిక వరి రకాల నారును జూలై చివరి వరకు పోసుకోవచ్చు. వరిలో తడి లేదా పొడి పద్ధతిలో విత్తనశుద్ధి చేసుకోవాలి. ఆర్‌ఎన్‌ఆర్–15048 (తెలంగాణ సోనా) వరి రకానికి నారు మడిని జూలై నెలాఖరు వరకు వేయొచ్చు. వరి నాటు వేసుకునే వారం ముందు ఎకరానికి సరిపోయే నారుమడికి 800 గ్రా. కార్భోప్యూరాన్, 3 సీజీ గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలి
● మొక్కజొన్న: 50–75 మి.మీ. వర్షపాతం వారం రోజుల్లో నమోదైతే రైతులు 90 రోజుల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన స్వల్పకాలిక మొక్కజొన్న హైబ్రిడ్ రకాలను బోదె – సాళ్ల పద్ధతిలో జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. వర్షాలు తగ్గాక ఆకాశం నిర్మలంగా ఉన్నపుడు ఎరువుల యాజమాన్యం / పురుగులమందులు లేదా కలుపుమందులు పిచికా రీ చేపట్టాలి. కత్తెర పురుగు ఆశిస్తే వర్షాలు తగ్గాక 0.4 గ్రా. ఇమామెక్టివ్ బెంజోయేట్ లేదా 0.4 మి.లీ క్వోరాంట్రనిలిప్రోల్ లీటర్ నీటికి కలిపి మొక్క సుడుల్లో పోయాలి.
● పత్తి: రైతులు ప్రస్తుతం పత్తి విత్తనాలు నాటడం మంచిది కాదు. ఆలస్యంగా విత్తితే పంట సరిగాస్థిరపడక పోవడం, చీడపీడల ఉధృతి పెరగడమే కాక దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. వర్షాల కారణంగా పత్తిలో కాండం కుళ్లు తెగుళ్లు సోకడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ తెగుళ్లను గమనిస్తే వర్షాలు తగ్గాక 2 గ్రా. కార్భండజిమ్ + మాంకోజెబ్ మందును లీటర్ నీటికి కలిపి మొక్క మొదలు తడిచేలా పోయాలి.
కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భరత్


