సింగరేణిలో మెగా ప్లాంటేషన్‌ | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో మెగా ప్లాంటేషన్‌

Jul 22 2026 12:18 AM | Updated on Jul 22 2026 12:18 AM

రుద్రంపూర్‌: సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో మంగళవారం మహా వృక్షారోపణ(మెగా ప్లాంటేషన్‌) నిర్వహించారు. సంస్థ పరిధిలో ఒకేరోజు 50 వేల మొక్కలను నాటారు. ఈమేరకు కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో అటవీ విభాగం ఆధ్వర్యాన 500 మొక్కలు నాటగా డైరెక్టర్లు ఎల్‌.వీ.సూర్యనారాయణ, తిరుమలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఏక్‌ పేడ్‌.. మాకే నామ్‌’ నినాదంతో దేశ వ్యాప్తంగా మొక్కలు నాటుతుండగా సింగరేణిలోనూ ఖాళీ ప్రదేశాల్లో మెగా ప్లాంటేషన్‌ నిర్వహించామని తెలిపారు. ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీఎంలు, వివిధ విభాగాల అధికారులు మనోహరరావు, వెంకటరమణ, లక్ష్మీపతిగౌడ్‌, ఎన్‌.రాఘవేంద్రరావు, సీహెచ్‌.మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన డైరెక్టర్లు

సూర్యనారాయణ, తిరుమలరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement