సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ (సీఎఫ్‌ఎల్) కొత్తగూడెం రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ సూచించారు. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఇటీవల లిటరసీ సెంటర్‌ను ఏర్పాటు చేయగా మంగళవారం ఆయన సీఎఫ్‌ఎల్ ప్రతినిధులు, సీఎస్‌పీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ శర్మ మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థి క సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని తెలిపారు. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థి క అక్షరాస్యతను పెంచి, బ్యాంకింగ్ సేవల వినియోగాన్ని విస్తరించాలని సూచించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనతో పాటు జన్‌ధన్ యోజన ఖాతాల కేవైసీపై సూచనలు చేశారు. సమావేశంలో కొత్తగూడెం లీడ్ బ్యాంక్ మేనేజర్ రామి రెడ్డి, అధికారులు భానుపద్మశ్రీ, బాదావత్ కిశోర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
24న కోటమైసమ్మతల్లి జాతర దుకాణాలకు వేలం
కారేపల్లి: మండలంలోని ఉసిరికాయలపల్లిలో జరిగే శ్రీకోటమైసమ్మతల్లి జాతరకు సంబంధించి దుకాణాలకు వేలం పాటలు ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త పర్సా పట్టాభిరామారావు, ఈఓ కటుకూరి వెంకట య్య తెలిపారు. ఆలయంలో మంగళవారం వారు మాట్లాడుతూ.. దసరా సందర్భంగా అక్టోబర్ 15 నుంచి 11 రోజుల పాటు జాతర జరగనుందని చెప్పారు. జాతరలో పలు రకాల దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఇచ్చేలా వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్దేశిత ధరావత్తు చెల్లించి పాల్గొనాలని, వేలంలో షాపు దక్కించుకుంటే మొత్తం సొమ్ములో 50 శాతం చెల్లించడమే కాక మిగతా సొమ్ముకు చెక్కు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు.
గురుకుల అభ్యర్థులకు రేపు ఇంటర్వ్యూలు
పాల్వంచరూరల్: జిల్లాలోని తొమ్మిది సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలు, జూనియ ర్ కాలేజీల్లో అధ్యాపకులు, ఇతర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 23న డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పాల్వంచలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల(సీఓఈ) కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని జిల్లా సమన్వయ అధికారి కె.వెంకటేశ్వర్లు తెలిపారు. అభ్యర్థులు గురువారం ఉద యం 9.30 గంటల కల్లా ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
నవోదయలో నేటి నుంచి
రీజినల్ స్థాయి యోగా పోటీలు
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోద య విద్యాలయలో బుధవారం నుంచి మూ డు రోజుల పాటు రీజినల్ స్థాయి యోగా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో రీజి యన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన 288 మంది బాలబాలికలు హాజరవుతారని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచే వారిని ఆగస్టు 30నుంచి పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్‌పూర్ జిల్లా నవోదయ విద్యాలయలో జరిగే జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక చేస్తారని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా నవో దయ విద్యాలయాల్లో రీజినల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా పాలేరు విద్యాలయ యోగా పోటీలకు వేదికగా ఎంపికై ంది. పలు ఆంతాల విద్యార్థులు మంగళవారం సాయంత్రానికి చేరుకున్నారు.
అకాడమీలో
ప్రవేశానికి పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యాన ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశాలకు సోమవారం పోటీలు నిర్వహించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల అథ్లెట్లు హాజరయ్యారు. వీరికి స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్, 600 మీటర్ల పరుగు, 30 మీటర్ల షటిల్ రన్ పోటీలు నిర్వహించారు. తొలిదశ పోటీలు పూర్తికాగా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాక ఎంపికై న వారి జాబితా విడుదల అవుతుందని నిర్వాహకులు తెలిపారు. పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి పర్యవేక్షించగా, కోచ్‌లు, అసోసియేషన్ ప్రతినిధులు ఎం.శ్రీనివాసరావు, ఎం.డీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు.


