రైతుల సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే లక్ష్యం

Jul 22 2026 12:18 AM | Updated on Jul 22 2026 12:18 AM

ములకలపల్లి: ప్రజలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా శక్తి మేర కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ములకలపల్లి మండలం రాజుపేట శివారులో మంగళవారం ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్‌ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రైతులు సంప్రదాయ పంటలకు బదులు పోలిస్తే సుస్థిర ఆదాయం కోసం పామాయిల్‌ సాగు చేయాలని సూచించారు. ఒకసారి నాటితే సుమారు 30 ఏళ్లపాటు రాబడి ఉంటుందని వివరించారు. కాగా, ఎల్‌నినో నేపథ్యాన రైతులు అపరాల సాగు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ సాగులో భద్రాద్రి జిల్లా ప్రథమ స్థానాన ఉందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 90 వేల ఎకరాల్లో సాగవుతుండగా, ఈ ఏడాది కొత్తగా 15 వేల ఎకరాల సాగు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. ఆతర్వాత 50శాతం రాయితీపై రైతులకు కంది. మినుము విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఏఓ బాబూరావు, కొత్తగూడెం ఆర్‌డీఓ మధు, తహసీల్దార్‌ బిందుస్వామి, సర్పంచ్‌ కొర్సా చంద్రలేఖ, ఏఓ అరుణ్‌బాబు, ఆయిల్‌పామ్‌ రైతులు ఆలపాటి రామచంద్రప్రసాద్‌, చిలకపాటి జైచందర్‌రావు, పర్వతనేని అమర్‌నాథ్‌, పువ్వాల మంగపతి, పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, అడపా నాగేశ్వరరావు, బాల అప్పారావు, నరాటి ప్రసాద్‌, తాండ్ర ప్రభాకర్‌రావు, కరుటూరి కృష్ణ, కొయ్యల అచ్యుతరావు, ఊకే రవి, కారం సుధీర్‌ పాల్గొన్నారు.

ఫ్లెక్సీ రగడ

మంత్రి తుమ్మలను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన స్వా గత ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయ డం వివాదాస్పదంగా మారింది. వేదికకు వెళ్లే మార్గం, చుట్టుపక్కల నాయకుడు పాలకుర్తి సుమిత్‌, సర్పంచ్‌ చంద్రలేఖ కొర్సా తదితరులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగా మంగళవారం ఉదయంలోగా చిరిగిపోయా యి. అధికార పార్టీలో విబేధాల నడుమ చింపేశారా, గాలికి చినిగిపోయాయా అనేది తెలియరాలేదు. ఈక్రమంలోనే సమావేశానికి కాంగ్రెస్‌ మండల అద్యక్షుడు జహీరుద్దీన్‌, తదితరులు గైర్హాజరైనట్లు తెలిసింది.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement