గిరిజన చిన్నారులకు పౌష్టికాహారం | - | Sakshi
Sakshi News home page

గిరిజన చిన్నారులకు పౌష్టికాహారం

Jul 22 2026 12:18 AM | Updated on Jul 22 2026 12:18 AM

భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం సమకూరుస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ తెలి పారు. ఇక్రిశాట్‌ బృందం వైద్యులు మంగళవారం భద్రాచలంలో పీఓను కలిశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసిన గిరిజన మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు భద్రగిరి మార్ట్‌ నెలకొల్పామని తెలిపారు. అంతేకాక దుమ్ముగూడెం, చర్ల, అశ్వారావుపేట మండలాల్లోని గిరిజన పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం సమకూరుస్తున్నామని చెప్పా రు. అనంతరం ఇక్రిషాట్‌ బృందం వైద్యులు మాట్లాడుతూ గిరిజన గ్రామాల చిన్నారులు, పాఠశాలల్లోని విద్యార్థులకు ఇక్రిశాట్‌ ఆధ్వర్యాన పైలట్‌ ప్రాజెక్టు కింద పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపా రు. అలాగే, రక్తహీనతతో బాధపడే చిన్నారులకు సౌష్టికాహారం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ చందన, ఏడీఎంహెచ్‌ఓ సైదులు, ఎంఈఓ రమ, వైద్యులు మాసన్‌ స్వామి కన్నా, రూపా బెనర్జీ, జూడి థామస్‌, అభినవ్‌ పాల్గొన్నారు.

● గిరిజన సంక్షేమ శాఖ ఖమ్మం జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా మండలాపురం ఫిరంగి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీడీగా ఉన్న విజయలక్ష్మి జేడీగా పదోన్నతిపై హైదరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో బాధ్యతలు స్వీకరించిన ఫిరంగని భద్రాచలంలో ఐటీడీఏ పీఓ రాహుల్‌ను కలవగా, పాఠశాలల పర్యవేక్షణపై సూచనలు చేశారు. ఐటీడీఏ డీడీ చందన తదితరులు పాల్గొన్నారు.

బూర్గంపాడు: ప్రకృతిని ఆరాధించటమే శీత్లా భవానీ పండుగ విశిష్టత అని ఐటీడీఏ పీఓ రాహుల్‌ తెలిపారు. బూర్గంపాడు మండలం అంజనాపురంలో మంగళవారం బంజారాలు నిర్వహించిన శీత్లా భవానీ పండుగలో పీఓ పాల్గొనగా పూజలు చేసి మాట్లాడారు. బంజారాలు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రకృతిని ఆరాధించే పండులు కొనసాగించాలని సూచించారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement