కలెక్టరేట్‌ ఎదుట ఆదివాసీల నిరసన | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట ఆదివాసీల నిరసన

Jul 21 2026 12:17 AM | Updated on Jul 21 2026 12:17 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): వేములూరు ఘటనపై ఫారెస్ట్‌ అధికారులను సస్పెండ్‌ చేయడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట బాధితులు, వివిధ సంఘాల మద్దతుతో నిరసన తెలిపారు. ప్రజావాణిలో అదనపకు కలెక్టర్‌ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో విత్తనాలు వేస్తుంటే అటవీశాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఫెన్సింగ్‌ వేసేందుకు జేసీబీలో వచ్చారని తెలిపారు. అడ్డుకున్న ఆదివాసీలపై విచక్షణ రహితంగా దాడి చేసి, తిరిగి వారే కేసులు పెట్టారని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, టీజేఎస్‌, ఇతర కుల సంఘాల నాయకులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, టీజేఎస్‌, ఎస్‌సీహెచ్‌ హక్కుల పోరాట సమితి, బీసీ సంఘం, పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ, పీవైఎల్‌ నాయకులు పాల్గొన్నారు.

టీజీఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రాంచందర్‌

టేకులపల్లి: టేకులపల్లికి చెందిన గుగులోత్‌ రాంచందర్‌ తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మూడోసారి ఎన్నికయ్యారు. పాల్వంచలో ఈ నెల 17,18 తేదీల్లో జరిగిన సమాఖ్య రాష్ట్రమహాసభల్లో ఈ ఎన్నిక జరిగింది.

పవర్‌ లిఫ్టర్‌కు పతకాలు

భద్రాచలంటౌన్‌: భద్రాచలానికి చెందిన రిటైర్డ్‌ ఎస్బీఐ అధికారి డీవీ శంకరరావు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌ (ఔరంగాబాద్‌) లో జరిగిన నేషనల్‌ మాస్టర్స్‌ క్లాసిక్‌ అండ్‌ ఎక్విప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాపియన్‌ షిప్‌లో సత్తా చా టాడు. సోమవారం జరిగిన పోటీల్లో మూడు వ్యక్తిగత విభాగాలతోపాటు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ గెలిచి నాలుగు పతకాలు సాధించాడు. 73 ఏళ్ల వయసులో పతకాలు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాష్ట్ర పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు వి.మల్లేష్‌, జిల్లా అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్‌రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు.

టీఐసీసీఐ ప్రధాన

కార్యదర్శిగా సీతారాం

పాల్వంచ: ట్రైబల్‌ ఇండియన్‌ చాబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ జిల్లా జనరల్‌ సెక్రటరీగా పాల్వంచకు చెందిన ధర్మసోతు సీతా రాం నాయక్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ధరావత్‌ శ్రీనివాస్‌ నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సీతారాం తెలిపారు.

సింగరేణి

అధికారులకు శిక్షణ

రుద్రంపూర్‌: డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023 అమలుపై సింగరేణి కార్పోరేట్‌ అధికారులకు కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో సోమవారం శిక్షణ ఇచ్చారు. హెచ్‌ఆర్‌డీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖకు చెందిన హిందుస్తాన్‌ అకా డమి ఆఫ్‌ లా ప్రొఫెజర్‌ వి.పార్వతీశం శిక్షణ ఇచ్చారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

108 అంబులెన్స్‌ తనిఖీ

బోనకల్‌: బోనకల్‌, చింతకాని మండలాలకు సేవలందిస్తున్న 108 అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌(ఈఎంఈ) ఆలేటి ప్రవీణ్‌కుమార్‌ సోమవారం తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో మందుల లభ్యత, పరికరాల పనితీరును ఆయన పరిశీలించారు. బాధితుల నుంచి వచ్చే ఫోన్లకు సత్వరమే స్పందించి ఘటనాస్థలికి వెళ్లడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించవచ్చని తెలిపారు. సిబ్బందితో తో మాట్లాడి పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement