యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Jul 21 2026 12:17 AM | Updated on Jul 21 2026 12:17 AM

టేకులపల్లి: మండలంలోని కోయగూడెం పంచాయతీ హనుమాతండాకు చెందిన యువకుడు గుగులోత్‌ శ్రీకాంత్‌ (23) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గుగులోత్‌ రవి జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీకాంత్‌ ఫొటోగ్రఫీ, డెకరేషన్‌ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం సుజాతనగర్‌ మండలంలోని అమ్మమ్మ ఇంట్లో శుభకార్యం ఉండగా కుటుంబ సభ్యులు నలుగురూ వెళ్లారు. సోమవారం సాయంత్రం శ్రీకాంత్‌ తనకు అర్జెంట్‌ పని ఉందంటూ శ్రీకాంత్‌ స్వగ్రామానికి వచ్చి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు హడావిడిగా వెళ్లడంతో అనుమానం వచ్చి తండ్రి రవి కూడా స్వగ్రామానికి వచ్చాడు. అప్పటికే శ్రీకాంత్‌ ఉరి వేసుకుని మృతి చెందాడు. తాను ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని, అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై టేకులపల్లి ఎస్‌ఐ తిరుపతిని వివరణ కోరగా.. విచారణ చేపట్టామని, ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేస్తామని తెలిపారు.

గంజాయి సీజ్‌

కారు, రెండు బైక్‌లు స్వాధీనం

పాల్వంచ: ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రూ. 20లక్షల విలువైన గంజాయిని సీజ్‌ చేశారు. సోమవారం ఎకై ్సజ్‌ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వి.సోమిరెడ్డి వెల్లడించిన వివరాలు.. పాల్వంచ మండలం రంగాపురం వద్ద వాహన తనిఖీలు చేపట్టిన క్రమంలో ఓ కారులో తనిఖీ చేయగా 27.5కేజీల గంజాయి లభ్యమైంది. గంజాయి, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడు మల్కన్‌గిరికి చెందిన బినయ సర్కార్‌గా గుర్తించారు. గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. మరో ఘటనలో మరో రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా 6.2 కేజీల గంజాయి లభించింది. నిందితులు ములకలపల్లికి చెందిన నూపా రవికిరణ్‌, తాళ్ల ధనరాజ్‌లుగా తేలింది. మరో వాహనంలో 6.3 కేజీల గంజాయి లభించగా, నిందితులు భద్రాచలానికి చెందిన వేల్పుల భరత్‌, గద్దల శశాంక్‌లుగా గుర్తించారు. మూడు బైక్‌లు, నాలుగు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని పాల్వంచ ఎకై ్సజ్‌ స్టేషన్‌లో అప్పగించామని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేశామని, ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వివరించారు. సమావేశంలో ఎకై ్సజ్‌ అధికారులు ఎ.శ్రీనివాస రెడ్డి, సీహెచ్‌.శ్రీనివాస్‌, ఎం.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌

గెలల ట్రాక్టర్‌బోల్తా

అశ్వారావుపేట: అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌ సెంటర్‌లో ఆయిల్‌పామ్‌ గెలలను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ ట్రైలర్‌ సోమవారం బోల్తా పడింది. బస్టాండ్‌ రోడ్‌ నుంచి ఫ్యాక్టరీకి గెలలను తరలించే క్రమంలో మాంసం దుకాణాల వద్ద మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement