భద్రాచలం: ప్రభుత్వ పథకాల సద్వినియోగంతో గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవా రం ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిశీ లించి, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశా రు. అనంతరం పీఓ మాట్లాడుతూ స్వయం ఉపాధి పథకాలు, స్కిల్స్ డెవలప్‌మెంట్‌పై మహిళలు, యువత అవగాహన పెంచుకోవాలన్నారు. ఐటీడీఏకు వచ్చే గిరిజనుల పట్ల సానకూలంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్‌డీసీ ఆనంద్ కుమార్, డీడీ చందన, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, ఈఈ మధుకర్, ఏడీడిఎంహెచ్‌ఓ సైదులు, ఏఓ సున్నం రాంబాబు, గన్యా నాయక్, నారాయణరావు, సమ్మయ్య, మణిధర్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్


