అశ్వాపురం: వేములూరు గ్రామాన్ని ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్‌శ్రేష్ఠ, డీఎఫ్‌ఓ సిద్దార్థ్ విక్రమ్‌సింగ్ సోమవారం సందర్శించారు. తొలుత మణుగూరులో ఎఫ్‌డీఓ కార్యాలయంలో వేములూరు పోడు భూముల వద్ద ఘర్షణలో గాయపడ్డ అటవీశాఖ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామానికి సందర్శించి సర్పంచ్ పవన్, గ్రామస్తులతో మాట్లాడారు. పోడు వివాదం గురించి తెలుసుకున్నారు. గిరిజనులు, ఆదివాసీలు పోడు భూములకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలతో ఐటీడీఓ కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, ఎఫ్‌డీఓ బాబు, మణుగూరు, అశ్వాపురం ఎఫ్‌ఆర్‌ఓలు ఉపేందర్, సత్తార్‌అలీ, డీఆర్‌ఓలు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, తహసీల్దార్ సూర్యప్రకాష్ పాల్గొన్నారు.


