చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Jul 20 2026 12:38 AM | Updated on Jul 20 2026 12:38 AM

ఇల్లెందురూరల్‌: మండలంలోని మాణిక్యారం గ్రామానికి చెందిన పొనక బాబూరావు (41) గత నెల 25వ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మస్సివాగు గ్రామంలో విత్తనాలు కొనుగోలు చేసేందుకు యదళ్లపల్లి నరేశ్‌, బాబూరావు ఇద్దరు కలిసి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన గేదెను తప్పించబోయి చెట్టును ఢీకొన్న ఘటనలో బాబూరావు గాయపడ్డాడు. మృతుడి భార్య సత్యవతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు కొమరారం ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు.

మోరీలో జారిపడి రిటైర్డ్‌ కార్మికుడి మృతి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం టూటౌన్‌ పరిధిలోని రుద్రంపూర్‌కు చెందిన రిటైర్డ్‌ కార్మికుడు పులిగోరి ఐలయ్య (68) శనివారం రాత్రి నాలేరియా ప్రాంతంలోని మోరీ సైడ్‌ వాల్‌పై కూర్చుని ప్రమాదవశాత్తు అందులో పడి దుర్మరణం పాలయ్యాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్‌ ఎస్‌ఐ జీవన్‌రాజ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్కూటీ చోరీపై కేసు

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌లోని ఆంజనేయస్వామి ఆలయం షెడ్డులో ఈ నెల 6వ తేదీన పార్కింగ్‌లో ఉంచిన ద్విచక్ర వాహనాన్ని (స్కూటీ) గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అప్పటి నుంచి తెలిసిన వారిని, పట్టణ పరిసరాల్లో గాలించిన కారణంగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుకు ఆలస్యం అయిందని విజయలక్ష్మి.. శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. టౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement