సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఇటీవల రాష్ట్ర అథ్లెటిక్ చాంపియన్ షిప్ నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఏడు పతకాలు సాధించారు. ఈ మేరకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహీధర్ ఆదివారం వివరా లు వెల్లడించారు. రెండు బంగారు, రెండు రజత, మూడు కాంస్య పతకాలు గెలుచుకున్నారని తెలిపారు. పతకాలు సాధించినవారిలో పి.హర్షిత, విజయదుర్గ, సమీరా, వి.వెన్నెల, వి.విశ్వప్రశాంతి, తాటి వర్షిత, సున్నం శైలు ఉన్నారని పేర్కొన్నారు. విజేతలను జిల్లా క్రీడల అధికారి ఎం.పరంధామరెడ్డి, అథ్లెటిక్స్ కోచ్‌లు పి.నాగరాజు, పి నాగేందర్, పవన్ అభినందించారు.
గురుకులాలకు
డిజిటల్ బోర్డులు
పాల్వంచరూరల్: గురుకులాల్లో ప్రభుత్వం బ్లాక్ బోర్డులకు స్వస్తి చెబుతూ డిజిటల్ బోర్డులు అందిస్తోంది. పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యామ్‌సైడ్ గిరిజన గురుకుల పాఠశాలకు 2, మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌కు 3, పాల్వంచ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు 2, భద్రాచలం గురుకులానికి 2 చొప్పున అందించింది. డిజిటల్ బోర్డులపై 8,9,10 తరగతుల విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులకు బోధన కొంత సలువుకానుంది.
‘ఆర్యవైశ్య’ రాజకీయ కమిటీ వైస్‌చైర్మన్‌గా ఖాదర్
టేకులపల్లి: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ వైస్‌చైర్మన్‌గా మండలంలోని రామచంద్రునిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి ఖాదర్‌బాబును నియమించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ జారీచేసిన నియామక పత్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షుడు దారా రమేశ్ ఆదివారం ఖాదర్‌బాబుకు అందజేశారు. కాగా, ఖాదర్‌బాబును పలువురు అభినందించారు.
108 ఈఎంఈగా ప్రవీణ్‌కుమార్
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా అత్యవసర సేవల విభాగం 108 సర్వీస్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్(ఈఎంఈ) గా ఆలేటి ప్రవీణ్‌కుమా ర్ నియమితులయ్యా రు. ఇన్నాళ్లు ఈఎంఈ గా ఉన్న అవులూరి దుర్గాప్రసాద్ వనపర్తి జిల్లాకు బదిలీ కాగా, ఆయనను ఖమ్మం కార్యాలయంలో ఆదివారం 108, 1962, 102 వాహనాల ఉద్యోగులు సన్మానించి వీడ్కోలు పలికా రు. అనంతరం ప్రవీణ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించగా శుభాకాంక్షలు తెలిపారు. అత్యవసర సర్వీసుల విభాగం అధికారులు, ఉద్యోగులు షేక్ నజీరుద్దీన్, షేక్ ఇమామ్ పాషా, తుమ్మా జగదీష్, శ్రీనివాస్, కొమ్ము వెంకటేష్, గొల్లమందల కృష్ణ, భాస్కర్, వినోదరావు, మేడా పుల్లారావు, భూషయ్య, కృష్ణయ్య, రేణుక, విజయలక్ష్మి, సంగిశెట్టి మోహన్, సయ్యద్ ఖాద్రీ, సీతా రాంబాబు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల నిధుల ఖర్చుపై ఆడిట్
పాల్వంచ: ప్రభుత్వ పాఠశాలలో ఖర్చు చేసిన నిధుల వినియోగంపై హైదరాబాద్‌కు చెందిన ఆడిట్ అధికారులు తనిఖీ చేశారు. ఆదివారం స్థానిక కేటీపీఎస్ కాలనీలోని అభ్యుదయ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్‌బీ, సీవీసీఏ ఆడిట్ అధికారులు సత్యనారాయణ, శ్రీమన్నా రాయణ, తనూజ్, కరుణాకర్ ఉపాధ్యాయుల నుంచి రికార్డులు, క్యాష్‌బుక్స్, బిల్లులు, ఓచర్లు పరిశీలించారు. స్వచ్ఛభారత్, బడిబాట ఇతర కార్యాక్రమాల నిర్వహణకు చేసిన ఖర్చులను ఆడిట్ చేశారు. జిల్లాలోని కేజీబీవీలు, కళాశాలల నిర్వహణ ఖర్చులను సైతం తనిఖీ చేశారు. అయితే, ఆడిట్ అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసినందుకు ఆయా ప్రధానోపాధ్యాయుల నుంచి చేతివాటం ప్రదర్శించినట్లు పలువురు వాపోయారు. భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.


